* పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో ఉంచాల్సిన టీచర్.. కామ పాఠాలు బోధిస్తున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఘోట్కూరీ లో జరిగింది. విద్యార్థులకు అశ్లీల దృశ్యాలు చూపిస్తోన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాదీర్‌ను తరగతి గదిలో బంధించారు. కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేశారు. గతంలో కూడా ఇదే విధంగా ఈ ఉపాధ్యాయుడు వ్యవహరించారని, తీరు మార్చుకోని టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
* తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది దంపతులు హత్యపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయవాద దంపతులు గట్టు వామాన్ రావు, నాగమణి హత్యలపై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన నివేదికను అధికారులు హైకోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా పోలీస్‌శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారు.. ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. ఏ2, ఏ3ల స్టేట్‌మెంట్‌ని ఎందుకు సెక్షన్ 164 కింద ఇంకా నమోదు చేయలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్‌ని ఎందుకు రికార్డు చేయలేదని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. బాధితులను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని అడిగారు. మెజిస్ట్రేట్‌ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. అయితే హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు మొబైల్ ఫోన్స్, రక్తపు మరకలను, కాల్‌డాటాని, నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తేలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీపీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదన్న హైకోర్టు ప్రశ్నకు ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను కూడా సాక్షులుగా గుర్తించామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులకు ఎటువంటి రక్షణ కల్పించారో తెలపాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. పోలీసులు అన్ని రక్షణ కార్యక్రమాలు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఏజీ తెలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదని హైకోర్ట్ ప్రశ్నించింది. ఇందుకు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్‌మెంట్ రికార్డు చేశారని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని తెలిపిన ఏజీ.. త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు తెలిపారు. నేరస్థుల నుంచి నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందన్నారు. అందుకే సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద స్టేట్‌మెంట్ రికార్డు చేశామని తెలిపారు. పూర్తి సాక్ష్యాలు సేకరించడానికి గాను మరో రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 15కు వాయిదా వేసింది. పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్య ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది.
* తెలంగాణ హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికాయి. బ్యారేజ్ 53, 54 పిల్లర్ల వద్దరెండు కత్తులను గజఈతగాళ్లు వెలికి తీశారు. కాగా కత్తుల కోసం పోలీసులు రెండు రోజులు వేట కొనసాగించగా సోమవారం వీరి ప్రయత్రం ఫలించింది. ఆదివారం రోజు సాయంత్రం వారకు సుందిళ్ల బ్యారేజీలో కత్తుల కోసం గాలించిన పోలీసులు, గజ ఈతగాళ్లు.. రెండో రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం సుందిళ్ల పార్వతి బ్యారేజ్ వద్దకు ఇద్దరు నిందితులను పోలీసులు తీసుకొచ్చారు. అయితే హత్యకు ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో 59 పిల్లర్ వద్ద పడేశామని గురువారం నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి చూపించగా నేడు 45వ పిల్లర్ నుంచి 60వ పిల్లర్ వరకు మధ్యలో పడేశామని మాట మార్చారు. దీంతో కేసులో కత్తులు కీలకంగా మారడంతో పోలీసులు సవాల్‌గా స్వీకరించారు. ఈ క్రమంలో రెండు కత్తుల కోసం అయిదుగరు గజ ఈతగాళ్లతోపాటు 50 మంది పోలీసులు గాలించారు. వీరిలో ముగ్గురు గజఈతగాళ్ళు నీట మునిగి కత్తుల కోసం వెతికారు. పై నుంచి భారీ అయస్కాంతంతో పోలీసుల వెతికారు. చివరికి గజఈతగాళ్లకే కత్తులు లభ్యమయ్యాయి. ఇదిలా ఉండగా ఆరు వందల రూపాయల విలువ చేసే రెండు కత్తుల కోసం రెండు రోజులుగా పోలీసులు హైరానా పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* కృష్ణా జిల్లాలో విచిత్రమైన దొంగతనం బయటపడింది. రూ.500కే టీవీ అమ్ముతుంటే పోలీసులకు అనుమానం వచ్చింది.. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. జగ్గయ్యపేట మండలం గౌరవరం హైవేపై రూ.500 టీవీని అమ్మేందుకు ప్రయత్నించారు. అంత తక్కువ ధరకు టీవీ విక్రయించేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చింది. వెంటనే టీవీ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు.. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఎనికేపాడు ఎల్‌జీ షోరూమ్ నుంచి భీమవరం వెళ్లేందుకు ఎలక్ట్రానిక్ వస్తువుల ఆటోను లోడ్ చేశారు. యూపీకి చెందిన వ్యక్తుల కన్ను ఆ ఆటోపై పడింది.. లోడ్ చేసిన వస్తువుల్ని దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. ఎనికేపాడులో దొంగిలించి వాటిని హైదరాబాద్ తీసుకువెళుతున్నారు. గౌరవరం దగ్గరకు రాగానే వస్తువులు తీసు డీజిల్ అయిపోవటంతో టీవీని రూ.500లకు అమ్మే ప్రయత్నించి పోలీసులకు చిక్కారు. రూ.9 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
* ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామ మామిడితోటలో కాపలాగా ఉంటున్న వ్యక్తి చలం శ్రీనివాసరావు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.