* నగరంలో భారీగా నల్లడబ్బు వెలుగులోకి వచ్చింది.బోగస్ కంపెనీల ద్వారా అవకతవకలకు పాల్పడుతోన్న ఓ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు రూ.400 కోట్ల నల్లడబ్బును గుర్తించారు.వివరాలు.. గత నెల 24న ఐటీ అధికారులు నగరంలో ప్రసిద్ధి చెందిన ఓ ఫార్మస్యూటికల్ కంపెనీపై దాడులు చేశారు.బోగస్ కంపెనీల ద్వారా ఈ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు.మొత్తం రూ.400 కోట్ల నల్లధనం ఉన్నట్లు కనుగొన్నారు.ఈ క్రమంలో అధికారులు రూ.1.66 కోట్ల నగదు, కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. మన్నే సత్యనరాయణ రెడ్డికి చెందిన MSN ఫార్మా కంపెనీలో ఈ దాడులు జరిగాయి.
* చిత్తూరు కలెక్టర్ బంగ్లా ముందు దారుణం గుర్తు తెలియని వ్యక్తి లు ఆటో డ్రైవర్ ని చెయ్యి గొంతు కోసి పారిపోయారు. సంఘటన తెలుసు కొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటో డ్రైవర్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
* మూడు లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత-డిఎస్పి ఎన్.ఎస్ వి వెంకటేశ్వరరావు,టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు చేస్తుండగా పట్టివేత, గంజాయి రవాణా చేస్తున్నారు ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు,గంజాయి రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం, విజయవాడలో గంజాయి సప్లై చేసిన వ్యక్తిపై కేసు నమోదు,పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కేసు పూర్వాపరాలు వెల్లడించిన డిఎస్పి,
* అమరావతి మండలం వైకుంఠపురంలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది.కృష్ణా నదిలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.చిన్నారుల తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.నిన్న మధ్యాహ్నం ఆడుకోవడానికి వెళ్ళి ఇక వెంకటనాగసాయి, గోవర్దన్ తిరిగి రాలేదు.
* పాలకొల్లు పట్టణం ముచ్చర్లవారి వీధిలో దారుణం.ఇంటి అద్దె అడిగాడన్న కోపంతో యజమానిని ప్రసాద్‌ను రాయితో కొట్టి చంపిన కిరాయి దారుడు అడపా చినకొండయ్య
* పెనుకొండ మండలం లోని ఎర్రమంచి లో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
* సచివాలయానికి ఇంటి యాజమాన్యం తాళం..!గుంటూరు జిల్లా, గురజాల నగర పంచాయతీలో మూడవ నంబర్ సచివాలయానికి ఇంటి యాజమాన్యం తాళం వేసింది.దీంతో సచివాలయ సిబ్బంది రోడ్డు పైనే వేచి ఉండాల్సి వచ్చింది.తమకు ఆరు నెలలుగా అద్దె చెల్లించలేదని ఆగ్రహించిన ఇంటి యాజమాని తాళం వేసినట్టు తెలుస్తోంది.