Politics

నాకు మార్పు కనపడాలి-తాజావార్తలు

I want to see the changes in health care - CM Jagan orders

* కార్పొరేట్‌ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం కావాలని చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అనే మాటే వినిపించకూడదని.. ఎంత మంది అవసరమైతే వారందరినీ నియమించుకోవాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తదితరులు హాజరయ్యారు. ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థంగా ఉండాలని.. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మనం ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవాడికి లభ్యం కావాలని సీఎం చెప్పారు. బెడ్‌షీట్ల దగ్గర నుంచి శానిటేషన్‌ సహా అన్ని అంశాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. రోగులకు ఇచ్చే గది, పడకలు, ఆస్పత్రి వాతావరణం, రోగులకు అందిస్తున్న భోజనం.. ఈ మూడు అంశాల్లో కచ్చితంగా మార్పులు కనిపించాలన్నారు. ఆస్పత్రుల్లో పరికరాలు పనిచేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని.. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) తయారుచేయాలని సీఎం నిర్దేశించారు. ఆస్పత్రుల నిర్వహణను తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేశారు.

* అసోంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే వెంటనే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేసే చట్టాన్ని తీసుకొస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.

* కేంద్రం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్​నేత మన్మోహన్​ సింగ్​ విమర్శించారు.

* ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం.వారం రోజుల్లో 40 మిలియన్ యూనిట్ల పెరుగుదల.ప్రస్తుతం రోజుకు గరిష్టంగా 208 మిలియన్ యూనిట్ల వినియోగం.గత ఏడాది మార్చ్ లో గరిష్ట వినియోగం 206 మిలియన్ యూనిట్లు.ఈ సారి ఫిబ్రవరిలోనే అత్యధికంగా 208 మిలియన్ యూనిట్ల వినియోగం.రాష్ట్ర విభజన అనంతరం ఇంత డిమాండ్ రావటం ఇదే మొదటిసారి.

* కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు.

* ఏపీలో కొత్తగా 106 మందికి కరోనా నిర్ధారణ

* గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో 43శాతం మేర నిరుద్యోగం ఉంటే.. తెలంగాణలో 35 శాతం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.గాంధీభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడారు.అధికారంలోకి రాగానే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన మోదీ సర్కార్‌.. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని విమర్శించారు.ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చేవని.. ప్రైవేటుపరం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.కేంద్రంలో ఈ పరిస్థితి నెలకొంటే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ తీరు మరోలా ఉందని భట్టి ధ్వజమెత్తారు.

* మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ ఎన్నికలు జరిగే చోట్ల ఐదు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార షెడ్యూలును తెలుగు తమ్ముళ్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఈ జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. త్వరలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున పురపాలక ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకునట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

* ఒడిశాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.7.90 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్‌ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్‌ పోస్టు వద్ద ఈ నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వాహనాల తనిఖీ సమయంలో వీటిని గుర్తించామని కోరాపుట్‌ ఎస్పీ గుంటుపల్లి వరుణ్‌ తెలిపారు. నకిలీ నోట్లు తరలిస్తున్న కారుకు ఛత్తీస్‌గఢ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉందన్నారు. రూ.500 నోట్లను పెద్ద సంచుల్లో తరలిస్తున్నారని తెలిపారు. రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నంలోని వ్యక్తికి నకిలీ నోట్లు అందించేందుకు నిందితులు వెళ్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు.

* బెంగాల్‌ ఎల్లప్పుడూ సాంస్కృతిక జాతీయవాదపు నేలగానే ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో విప్లవ భూమిగా ఉన్న పశ్చిమబెంగాల్‌లో ఈ రోజు అరాచక వాతావరణం నెలకొనడం అందరినీ బాధిస్తోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మంగళవారం ఆయన మాల్దాలో భాజపా ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. మమత సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చారు. రాష్ట్రంలో దుర్గాపూజను కూడా నిషేధించారని, ఈద్‌ రోజున గోవధను బలవంతంగా ప్రారంభించారంటూ ఆరోపించారు. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న గో అక్రమ రవాణాపైనా ప్రభుత్వం మౌనంగానే ఉందన్నారు. రాష్ట్రంలో జైశ్రీరాం నినాదాన్ని కూడా నిషేధించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు దీన్ని ఎంతో కాలం కొనసాగనీయరంటూ ధ్వజమెత్తారు. గో అక్రమ రవాణా, లవ్‌ జిహాద్‌లను అడ్డుకోవడంలో దీదీ సర్కార్‌ విఫలమైందన్నారు. ఒకప్పుడు దేశాన్ని నడిపించిన బెంగాల్‌.. నేడు అరాచక పరిస్థితులు ఎదుర్కోంటోందని యోగి వ్యాఖ్యానించారు.

* దేశంలోని ప్రధానమైన ఏడు నగరాల్లో విలాసవంతమైన ప్రాంతాల ఇంటి అద్దెల వృద్ధిలో హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ మొదటిస్థానంలో ఉంది. 2014-20 మధ్య దేశవ్యాప్తంగా ఈ నగరాల్లో అద్దెల వృద్ధి 12 శాతం ఉండగా, హైటెక్‌సిటీలో అద్దెలు 26 శాతం వృద్ధి కనబరిచినట్లు అనరాక్‌ నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన ఏడు నగరాలకు సంబంధించిన లగ్జరీ ప్రాంతాల అద్దె, ఇంటి విలువ పెరుగుదల నివేదికను అనరాక్‌ విడుదల చేసింది. దీని ప్రకారం జూబ్లీహిల్స్‌లో 15 శాతం అద్దెలు పెరిగాయి. బెంగళూరులోని రాజానగర్‌లో ఇంటి విలువ అత్యధికంగా 22 శాతం పెరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఇంటి విలువ, మూలధన పెరుగుదల 12 శాతం ఉన్నట్లు నివేదిక తెలిపింది. 2020 ఏడాదిలో మొత్తం అన్ని నగరాల్లో అద్దె విషయంలో ఎలాంటి మార్పు లేదని నివేదిక పేర్కొంది.

* హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతంలో ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఆ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వైద్య పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి ఆయా విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు జరపగా.. 54 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో పాఠశాల వసతిగృహాన్ని మూసివేసిన అధికారులు.. ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

* ఐఫోన్స్‌ ఎన్ని వచ్చినా… శే సిరీస్‌లో వచ్చే మొబైల్స్‌ లెక్క వేరు. చిన్న స్క్రీన్‌తో, చక్కగా ఉండే ఆ మొబైల్స్‌ కోసం యాపిల్‌ యూజర్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకే నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఐఫోన్‌ శే (2020)ని అంతగా ఆదరించారు. ఈ ఊపులో శే (2021)ని తీసుకొస్తారేమో… అందులో ఇంకా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉంటాయేమో అని అభిమానులు ఎదురు చూశారు. అయితే, మూడో ఐఫోన్‌ శే వస్తుంది కానీ… ఈ ఏడాది అయితే కాదట. 2022లో కొత్త ఐఫోన్‌ శేని తీసుకొస్తారని సమాచారం. అంతేకాదు దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు కూడా బయటకొచ్చాయి. వచ్చే ఏడాది కాబట్టి 5జీ నెట్‌వర్క్‌తో వస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

* దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కీలక నేతలంతా ప్రచార ర్యాలీల్లో పాల్గొని తమ ప్రసంగాలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. తద్వారా ఓటర్లను తమ వైపు ఆకర్షించి అధికార పీఠం దిశగా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌, కేరళ, అసోం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు మార్చి/ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, బెంగాల్‌లో పాగా వేయాలనే పట్టుదలతో భాజపా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రచార పర్వంలోకి దించుతోంది. ఎనిమిది విడతల్లో జరగబోయే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ 20 ర్యాలీల్లో పాల్గొననున్నారు. అలాగే, అసోంలో ఆయన ఆరు ర్యాలీల్లో పాల్గొంటారని సమాచారం. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక జిల్లాలను కవర్‌ చేస్తూ ఆయన ప్రచారం సాగేలా కమలనాథులు ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో గణనీయ ఫలితాలు సాధించిన భాజపా.. ఆ ఉత్సాహంతోనే ముందుకెళ్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో నేతలు పని చేస్తున్నారు.

* అత్యాచారానికి గురయిన బాలికను పెళ్లిచేసుకోవడం ఇష్టమేనా? అని సోమవారం సుప్రీంకోర్టు నిందితుడిని ప్రశ్నించింది. మహారాష్ట్ర విద్యుత్తు ఉత్పాదన సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మోహిత్‌ సుభాష్‌ చవాన్‌ (23)పై అత్యాచారం కేసు నమోదయింది. 2014-15 ప్రాంతంలో తన దగ్గర బంధువైన బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు అందింది. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా, బాంబే హైకోర్టు తిరస్కరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.