‘‘ఒక మంచి అవకాశం మనదాకా వచ్చిందంటే నా దృష్టిలో అది చాలా పెద్ద విషయం. అందుకే వీలైనంత వరకు ‘నో’ చెప్పను. ఆ అలవాటు నా కెరీర్‌కి చాలా మేలు చేసింది’’ అని చెబుతోది రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘అయ్యారీ’ చిత్రంతో బిజీగా గడుపుతోంది. చేతిలో రెండు మూడు సినిమాలున్నా, మరో కొత్త సినిమాకి సంతకం చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది రకుల్. యువకథానాయికల్లో అందరికన్నా ఎక్కువజోరు చూపిస్తోంది. విరామం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తూ తన కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంటుంది. ‘‘ఎక్కడా లేని పోటీ సినిమా రంగంలో ఉంటుంది. అంత పోటీలోనూ ఓ అవకాశం నన్ను వెదుక్కొంటూ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి? అందుకే కథ, లేదంటే ఆ కలయికో నచ్చిందంటే సాధ్యమైనంత వరకు ఆ చిత్రాన్ని అంగీకరించడానికే ప్రయత్నిస్తుంటా. ప్రేమకథల్లో నటించే అవకాశం వచ్చిందంటే మాత్రం అస్సలు వదులుకోలేను. కథానాయికలకి పేరొచ్చేది ప్రేమకథలతోనే కదా’’ అని చెప్పుకొచ్చింది రకుల్‌ప్రీత్ సింగ్. పేరు, డబ్బు… ఈ రెండు విషయాల్లో మీ ప్రాధాన్యం దేనికి? అని అడిగితే… ‘‘ఒక మంచి పాత్ర ఇచ్చే ఆత్మసంతృప్తి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వలేదు. అందుకే పారితోషికం గురించి నేను మరీ ఎక్కువగా ఆలోచించను. నచ్చిన పాత్రకే నా ప్రాధాన్యత’’ అంది రకుల్.
నేను ఎవరికీ నో చెప్పను
Related tags :