Devotional

పాదాల మండపం విశేషాలు-TNI ఆధ్యాత్మిక తరంగిణి

పాదాల మండపం విశేషాలు-TNI ఆధ్యాత్మిక తరంగిణి

* కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం, పడాల మండపం. దీనినే పాదాల మండపం అని కూడా అంటారు. క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం. ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని ఉన్నాయి. మాధవదాసు అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యఒ .ఆ రోజు ఉపవాసం చేయడం, పిండితాళిగలు వేయడం సంప్రదాయం. ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో, కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి. ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. శ్రీకాళహస్తి నుండి ఒకరు, కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు .ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా….తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ….వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం. నారాయణ పాదములు తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో నారాయణ పాదం ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ-ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవ నిర్వహణ జరిగేది. వీటినే “నారాయణ పాదములు” అంటారు. ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు, ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు భూచక్ర గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తీర్థాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులను కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు. ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు.అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది.అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే- ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు.

* కేంద్రీయ వైద్య‌శాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో…తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప్రాంగ‌ణంలో గ‌ల కేంద్రీయ వైద్య‌శాల‌ను మంగ‌ళ‌వారం టిటిడి ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వహర్ రెడ్డి ప‌రిశీలించారు. ఆసుప‌త్రిలోని ఔట్‌పేషంట్ గ‌దుల‌ను, ర‌క్త‌సేక‌ర‌ణ గ‌ది, ఫార్మ‌సీ, మందుల నిల్వ గ‌దుల‌ను ప‌రిశీలించారు.ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు స‌త్వ‌ర వైద్య‌సేవ‌లందించాల‌ని, అవ‌స‌ర‌మైన మందులు సిద్ధంగా ఉంచుకోవాల‌ని డాక్ట‌ర్ల‌కు సూచించారు. పలువురు రోగులతో మాట్లాడి కేంద్రీయ వైద్య శాలలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.ఈవో వెంట టిటిడి ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, సిఎంఓ డాక్ట‌ర్ న‌ర్మ‌ద‌, ఎస్ఎంవో డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

* త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత పక్షి దర్శనం..త్రిపురాంతకంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఆవరణలో వింత పక్షి దర్శనం ఇచ్చింది.ఈ రోజు ఉదయం ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేస్తుండగా ఈ పక్షి కనిపించింది. ఈ పక్షి ఆకారం చూడడానికి వింతగా ఉంది. ఈ పక్షి పేరు పాలపక్షి. ఇది ప్రతి మహాశివరాత్రి ముందు ఆలయం నందు దర్శనమిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వంశర్మ వివరణ ఇచ్చారు.

* శ్రీ వెంకటాచల స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి పూర్ణాహుతి మరియు ధ్వజపట ఆవరోహణము జరిగింది.

* శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఉదయం 8.30 నుండి 8.53 గంటల మధ్య మీన‌లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.