తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో నిలబడిన ప్రవాసాంధ్రుడు సూరపనేని రాజా TNIకు తెలిపారు. తాను 2019 ఎన్నికల బరిలో నుండి వైదొలగి తానాకు లక్ష డాలర్ల మిగులును అందజేశానని తద్వారా సంస్థకు ఆర్థిక వనరులను ఆదా చేశానని అన్నారు. ఈ నిధులతో తానా సేవా కార్యక్రమాలు మరింతగా చేపట్టే వీలు కలగడం తనకు సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. సంస్థకు ఏది మంచిదో అది నిర్వహించడానికి తాను ఎల్లప్పుడు ముందడుగు వేస్తానని రాజా తెలిపారు. 2000లో అమెరికాకు ఉద్యోగం నిమిత్తం వచ్చిన ఆయన 2003 శాన్‌హోశే (రవాణా కమిటీ), 2005 డెట్రాయిట్ (రిజిస్ట్రేషన్, పర్యాటకం కమిటీలు), 2007 డీసీ (వసతి కమిటీ) మహాసభల్లో పాల్గొని…మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ప్రోత్సాహంతో…2005 నుండి తానా జీవితకాల సభ్యుడిగా సంస్థతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఫౌండేషన్ ట్రస్టీగా తనను గెలిపిస్తే ఫౌండేషన్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు సేవా కార్యక్రమాల వ్యాప్తిని విస్తరించేందుకు తోడ్పడతానని అన్నారు. ఇప్పటివరకు తానా ఆధ్వర్యంలో రాజా సమన్వయంలో నిర్వహించిన కార్యక్రమాలు దిగువ చూడవచ్చు….
* కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పెనుమచ్చ గ్రామం ఈయన స్వస్థలం.
* 2009-11: తానా పత్రిక ప్రకటనల కమిటీ అధ్యక్షుడు
* 2013-15: రవాణా కమిటీ అధ్యక్షుడు
* 2015: సెయింట్ లూయిస్ ధీంతానా సమన్వయకర్త
* 2017-19: తానా కార్యక్రమాల సమన్వయ కమిటీ అధ్యక్షుడు
* 8 తానా మహాసభల్లో పలు కమిటీల్లో సభ్యుడిగా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా సేవలు.
* 2015-17: సౌత్ సెంట్రల్ ప్రాంతీయ ప్రతినిధి (Conducted many programs like CPR, Dhim Tana, backpack ETC program in St.Louis. Conducted kick-off fundraising event for TANA 21st convention in St. Louis and successfully raised money for it.)
* గత 20ఏళ్లుగా ఎంతో మంది అధ్యక్షులతో కలిసి తానాలో విజయవంతైన ప్రయాణం.
* గత 14ఏళ్లుగా తానా చైతన్య స్రవంతి, రైతుకోసం కార్యక్రమాల్లో చురుకైన పాత్ర.
* సొంత నిధులతో 500మంది రైతులకు తానా రైతు కిట్ల పంపిణీ