DailyDose

శ్రీకాకుళంలో నాటుబాంబుల కలకలం-నేరవార్తలు

Crime News - Bombs Found In Srikakulam District

* శ్రీకాకుళం….కంచిలి మండలం గొల్లకంచలి గ్రామంలో నాటు బాంబులు లభించాయి.మున్సిపల్​ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు.ఈ క్రమంలో 40 నాటు బాంబులు బయట పడ్డాయి.అయితే ఇటీవలే ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.దీంతో ఆధిపత్యం కోసం ఓ వర్గం వారు వీటిని ఒరిస్సా నుంచి తెప్పించినట్టు పలువురు పోలీసులు భావిస్తున్నారు.దీనిపై విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామి రెడ్డి తెలిపారు.అడవి పందులను చంపడానికి.. వీటిని వినియోగిస్తున్నట్లు పలువురు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని కంచలి పోలీసులు పరిశీలించారు

* సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో వంద బాటిల్స్ అక్రమ తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నట్లు సత్తెనపల్లి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ మారయ్య బాబు గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఒక పత్రికా విలేఖరి అక్రమ తెలంగాణ మద్యాన్ని తీసుకుని వచ్చి రాజుపాలెం మండలం లో విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా నిందుతులు అలుగుమల్లి మహేష్ రెడ్డి తలకుల సాంబశివ రెడ్డి అనుపాలెం గ్రామంలో అక్రమ తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తూ ఉండంగా పట్టుకోడం జరిగిందని తెలిపారు.వారి దగ్గర్నుంచి 180 యం యల్ ఉన్నట్టు వంటి 100 అక్రమ తెలంగాణ మద్యం బాటిల్స్ ను అలానే ఒక హీరో హోండా ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.అలుగు మళ్లీ మహేష్ రెడ్డి ఒక పత్రిక విలేకరిగా పని చేస్తూ ఈ అక్రమ దంద నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

* గత కొన్ని రోజులుగా ఓ మాజీ రౌడీ షీటర్ పై దాడులు జరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది. గత ఆరు నెలల వ్యవధిలోనే మూడు సార్లు హత్యా ప్రయత్నం జరిగింది అంటే రౌడీ షీటర్ పై ప్రత్యర్థులు ఎంతగా పగబట్టి హత్యకు పక్క ప్రణాళికలు పన్నుతున్నారో అర్థమవుతుంది.ఈ ఘటనలు పోలీసులకు సవాలు గా మారాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఇందిరా నగర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ,మాజీ రౌడీ షీటర్ మండల రాము పై కొంతమంది దుండగులు హత్యా ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన రాము చాకచక్యంగా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. అనంతరం జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దుండగులు వాడిన టువంటి కత్తులు కర్రలను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మండల రాము గత 20 సంవత్సరాల క్రితమే ఓ రౌడీ షీటర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తరువాత క్రమంగా మారుతూ రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ప్రత్యర్ధులు మాత్రం రాము పై రివెంజ్ తీర్చుకునే ఎందుకు ఇప్పటికీ మూడు సార్లు ప్రయత్నం చేశారు. మూడు సార్లు కూడా స్వల్ప గాయాలతో బయట పడ్డాడు రాము. ఇల్లందులో టిఆర్ఎస్ పార్టీలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్.మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, రాము కోరం కనకయ్య తో వెంట ఉన్నందుకే,ఎమ్మెల్యే వర్గం కావాలని నా మీద దాడులు చేయిస్తున్నారని గతంలో రాము బహిరంగ విమర్శలు చేశాడు. ఇల్లందు ప్రాంతంలో వర్గ పోరు తో పాటు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతూ పార్టీకి ప్రజలకు తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడుతోంది.

* జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అంగర్ వాడీ వర్కర్లతో పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగం ఇచ్చినందుకు రూ. మూడున్నర లక్షలు ఇవ్వాలని జేసీ భార్య శ్రీలక్ష్మి డిమాండ్ చేశారని అంగన్ వాడి వర్కర్ రెహానా అనే ముస్లిం మహిళ నెల్లూరు 5వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ముస్లిం, దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఫిర్యాదులో జేసీ భార్య పేరులేదని సీఐ చెబుతుండగా… ఫిర్యాదును పోలీసులు మార్చేశారని ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుఉద్యోగం ఇచ్చినందుకు మూడున్నర లక్షలు డిమాండ్ చేశారని, రూ. 2 లక్షలు ఇచ్చానని రెహానా చెప్పారు. మిగిలిన లక్షన్నర ఇవ్వకపోవడంతో తమ ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ముస్లిం సంఘాల నేతలు మండిపడుతున్నారు. జేసీ భార్య లక్షన్నర చోరీ అయినట్లు ఫిర్యాదు ఇచ్చారని చెబుతున్న పోలీసులు.. జేసీ ఇంట్లో అంత డబ్బు ఎందుకు ఉందనే దానిపై దర్యాప్తు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ లెక్కన జేసీ పరిధిలో ఎంతగా అవినీతి జరుగుతుందో తేల్చాలని డిమాండ్ చేశారు.

* టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు గురువారం ఎదురుదెబ్బ తగిలింది.గత ఏడాది మార్చి నెలలో రాయదుర్గంలో ఎన్నికల అధికారులను బెదిరించిన కేసులో కాల్వ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.మాజీ మంత్రితో సహా 24 మంది టీడీపీ కార్యకర్తలకు అనంతపురం కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది.బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.కాగా గతంలో తన అనుచరులతో కలిసి ఎన్నికల అధికారులను కాల్వ శ్రీనివాస్‌ బెదిరించిన విషయం తెలిసిందే.

* జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద జమ్మలమడుగు గ్రామస్తుల నిరసన ప్రదర్శన చేశారు.మాచర్ల రూరల్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.పోలీసుల కొట్టడం వల్లే శివరామకృష్ణ పురుగు మందు తాగాడని బంధువులు ఆరోపిస్తున్నారు.తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.కేసు విచారణ లో భాగంగా శివరామకృష్ణ పురుగు మందు తాగి మృతి చెందాడు.మరోవైపు శివరామకృష్ణ మృతికి తమకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.