తానా 2021 ఎన్నికల్లో ప్రతిరోజు ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం సాయంత్రం క్యాపిటల్ ప్రాంతాన్ని ఏకగ్రీవంతో కైవసం చేసుకున్న నిరంజన్ ప్యానెల్‌కు ఆయన ప్రత్యర్థి వర్గం కొడాలి నరేన్ గురువారం సాయంత్రం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. నరేన్ నివాసమంటున్న డీసీ ప్రాంత ప్రతినిధి నిరంజన్ ప్యానెల్‌కు మద్దతు ప్రకటించగా, నిరంజన్ ఉంటున్న డెట్రాయిట్ ప్రాంతం నుండి నరేన్ ప్యానెల్ అభ్యర్థిగా గోగినేని శ్రీనివాస్ ఏకగ్రీవంగా ప్రాంతీయ ప్రతినిధిగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గోగినేని శ్రీనివాస్ గత 20ఏళ్లుగా డెట్రాయిట్‌లో ఉంటున్నారు. లీవోనియాలోని షిర్డీ సాయి ఆలయ ట్రస్టీగా ఉన్నారు. ఆయన ఏకగ్రీవం పట్ల డెట్రాయిట్ ప్రవాసులు హర్షం వెలిబుచ్చుతున్నారు. ఇది నిరంజన్ ప్యానెల్‌కు తమ రిటర్న్ గిఫ్ట్ అని, రాబోయే ఎన్నికలు ఏ స్థాయిలో ఉంటాయో నిరూపించడానికి ఇది టీజర్ మాత్రమేనని నరేన్ వర్గీయులు పేర్కొంటున్నారు.
Big Breaking: నిరంజన్ అడ్డాలో నరేన్ పాగా-రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కొడాలి వర్గం

Related tags :