Movies

అమ్మ బదులు నాన్న

అమ్మ బదులు నాన్న

‘ధర్మేంద్ర, నేనూ కలిసి చాలా సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించాం. మేమిద్దరం కలిసి తరచూ సినిమాలు చేయడంతో మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ విషయం మా ఇంట్లోవాళ్లకి తెలిసింది. అయితే, సాధారణంగా నేను ఏదైనా షూట్‌లో పాల్గొంటే.. నా వెంట అమ్మ లేదా బామ్మ సెట్‌కు వచ్చేవాళ్లు. కానీ, ఓసారి మాత్రం ధర్మేంద్రతో సినిమా చేస్తున్న సమయంలో నాతోపాటు నాన్న సెట్‌కు వచ్చారు. షూట్‌ అయ్యేంత వరకూ నాతోనే ఉన్నారు. ధర్మేంద్రతో మాట్లాడనివ్వలేదు. అలా మా ఇద్దర్నీ దూరంగా ఉంచాలని ఆయన భావించారు’’ అని ఆమె ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్న హేమమాలిని అప్పుడప్పుడు సినిమాల్లోన మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్ల క్రితం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆమె బాలయ్య తల్లి పాత్రలో కనిపించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘ఆదిపురుష్‌’లో ఆమె రాముడి తల్లి కౌసల్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.