తానా డెట్రాయిట్ ప్రాంతీయ ప్రతినిధిగా గురువారం సాయంకాలం ఏకగ్రీవంగా ఎన్నికైన గోగినేని శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థి అని అధ్యక్ష బరిలో పోటీపడుతున్న డెట్రాయిట్ ప్రాంతానికి చెందిన అభ్యర్థి నిరంజన్ శృంగవరపు TNIతో అన్నారు. గోగినేని ఎన్నిక ఏకగ్రీవం కావడంలో తాను కూడా పాత్ర పోషించానని, ఆయన ప్రచార చిత్రాల్లో ఎక్కడా ప్రత్యర్థుల ప్యానెల్‌ను ప్రస్తావించిన దాఖలాలు లేవని వెల్లడించారు. శ్రీనివాస్ తన ఏకగ్రీవానికి ధన్యవాదాలు తెలుపుతూ తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టిన సందేశం ఆయన ఇరు ప్యానెళ్లకు అతీతంగా ఉన్న వ్యక్తిగా నిరూపిస్తోందని నిరంజన్ వ్యాఖ్యానించారు. గోగినేని శ్రీనివాస్ ఫేస్‌బుక్ సందేశం దిగువ పరిశీలించవచ్చు….
గోగినేని స్వతంత్ర అభ్యర్థి: నిరంజన్
Related tags :