తానా 2021 అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న డెట్రాయిట్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు శృంగవరపు నిరంజన్ చికాగోలోని ప్రవాసులతో గత వారాంతం సమావేశమయ్యారు. స్థానిక హైదరాబాద్ హౌజ్, బిర్యానీ బౌల్ హోటల్‌లో స్థానిక ప్రవాసులు ఆకురాతి రజనీ, కానూరు జగదీష్, మిడ్‌వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధి అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్(బాబీ), బొప్పన శ్రీనివాస్, అనుమోలు రవిచంద్ర తదితరులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రవాసుల మద్దతును అభ్యర్థించారు. మార్పు అనివార్యమని, అది తన గెలుపుతో మొదలు కావాలని ఆకాంక్షిస్తున్నానని నిరంజన్ ప్రసంగిస్తూ అన్నారు.
చికాగో ప్రవాసులతో నిరంజన్ సమావేశం

Related tags :