* ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ సైతం గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ రుణాలపై వడ్డీరేటును 6.70 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.
* తక్కువ ధరకే ఇంటర్నెట్, ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చి… రిలయన్స్ జియో భారత్ టెలికాం రంగంలో విప్లవాన్ని తెచ్చింది. రిలయన్స్ తెచ్చిన ఈ మార్పుతో సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రమంలో జియో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కొన్ని నెలల క్రితం వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ పనులు కీలక దశకు చేరుకున్నాయని సమాచారం. ‘జియో బుక్’ పేరుతో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాది మే నాటికి జియో బుక్‌లు విపణిలోకి రావొచ్చు.
* తమ ఉద్యోగులకు అయ్యే టీకా ఖర్చును తామే భరిస్తామని దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అలాగే టీకా వేయించుకునేందుకు సిబ్బంది అంతా ముందుకు రావాలని కోరింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఉద్యోగులకు ఈమెయిల్ చేశారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపై పడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్షియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో నిఫ్టీ 15వేల దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.02గా ఉంది.