డల్లాస్‌లో ఇరువురు అభ్యర్థులు పట్టు వీడుతున్నట్లు కనపడట్లేదు. దినేష్ త్రిపురనేని ఒక వైపు, సతీష్ కొమ్మన మరో వైపు ఈసారి DFW ప్రాంతీయ ప్రతినిధులుగా తలపడుతున్నారు.
గత 48 గంటల్లో జరిగిన పరిణామాలు పరిశీలిస్తే….నామినేషన్ వేయడానికి పూర్వమే తాను తన ప్రత్యర్థికి తన అభిమతాన్ని తెలిపానని…అయినా తనపై పోటీకి రావడంపై సతీష్ విస్మయానికి గురయినట్లు సమాచారం. గత రెండేళ్లుగా కోవిద్ క్లిష్ట సమయంలో సైతం తానా తరఫున విద్యార్థులకు పేదలకు తోడ్పడ్డారని, తానా నిర్వహించిన కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి తన సమాయాన్ని, నిధులను ఈయన వెచ్చించడం పట్ల ప్రవాసుల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించిందని సమాచారం. డల్లాస్‌లో ఉన్న 3300 మంది ఓటర్లలో కొమ్మన సతీష్ ఇప్పటివరకు 2000మందితో మాట్లాడి ఉంటారని విశ్వసనీయ అంచనా. ప్రచారంలో కూడా సతీష్ ఒక పక్కా ప్రణాళికతో వెళ్తున్నారని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరికీ తన అభ్యర్థిత్వాన్ని బలపరచమని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం.
ఇన్ని ఉత్కంఠ పరిణామాల మధ్య డల్లాస్ ప్రాంతీయ ఈశుడిగా (ప్రతినిధిగా) ఎవరు గెలుస్తారనేది ఆ ఈశ్వరుడికే ఎరుక! ఆ ఈశుడు దినేశుడా? సతీశుడా? అనేది తెలియాలంటే మే వరకు ఆగాల్సిందే.
—సుందరసుందరి(sundarasundari@aol.com)