తెరాస బలం కార్యకర్తలే, ఎన్నారైల సేవలు మరువ లేనివి ,నిజం చెప్పి గెలుద్దాం , మొదటి ప్రాధాన్యత ఓటు తెరాస కే వెయ్యాలని విజ్ఞప్తి : ఎమ్మెల్సీ కవిత
తెరాస ఎన్నారై శాఖలను ఇంకా బలోపేతం చేస్తాం, చురుకుగా ప్రచారములో పాల్గొనాలని పిలుపు : మహేష్ బిగాల
ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ను ఈ రోజు టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, ఎన్నారై సలహాదారు కల్వకుంట్ల కవిత హాజరు అయ్యారు.ముందుగా విదేశాలలో వున్నా ఎన్నారై తెరాస కార్యకర్తలు ప్రమాదంలో చనిపోయిన వారికీ నివాళులు అర్పించారు, కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ప్రమాదంలో చనిపోయిన ఎన్నారై తెరాస కార్యకర్తలని కోల్పోయాం , వారికీ ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తూ , వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. వచ్చే రోజులలో ఏప్రిల్ 27 నాడు తెరాస ఆవిర్భావ దినోత్సవం వుంది అందరూ మెంబర్షిప్ డ్రైవ్ ని చురుకుగా చెయ్యాలని విజ్ఞప్తి చేసారు , అలాగే పట్టభద్రుల ఎలక్షన్స్ రాబోయే రోజులలో ఉన్నందున ,ఖమ్మం- వరంగల్- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గారిని గెలిపించాలి , అయన చాల విద్యాలయాలు వున్నాయి , ఎన్నో సమస్యలను పళ్ళ గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి గారిని గెలిపించాల్సిందిగా కోరారు , వాణి గారు పీవీ గారి కూతురు,విద్యావేత్త అలాగే కాకుండా ౩౦ ఇయర్స్ విద్య రంగములో వున్నారు , పల్లా గారిని మరియు వాణి దేవి గారి. గెలుపుకి ప్రయత్నం చెయ్యాలని తెరాస ఎన్నారై శ్రేణులు పాత్రా ఉండాలని , ఈ ప్రోగ్రాం చేసినందుకు మహేష్ బిగాల గారిని అభినందించారు ,ఈ మధ్య కాలములో ఎన్నారై శాఖలలో తెరాస ఎన్నారై శాఖ రెండు సంవత్సరాలు పూర్తి చేసినందుకు సౌత్ ఆఫ్రికా శాఖ మరియు మిగితా దేశాలకు శుభాకాంక్షలు తెలిపారు,ఆ శాఖ చేసే సహాయ కార్యక్రమాలను కొనియాడారు.మన బాధ్యతగా పల్లా గారిని , వాణి గారిని మనకు తెలిసిన వాళ్ళకి పరిచయస్తులని వోట్ గురించి కోరాలని కోరారు ,బీజేపీ చేస్తున్న అబద్ధాలని పటాపంచలు చేస్తూ గౌరవ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ గారు అన్ని రకాలుగా సాక్షాలతో సహా తిప్పి కొడుతున్నారు , ఈ ఎలక్షన్ ప్రచారములో గమనించినట్టు అయితే తెరాస సభ్యులే గెలిచే అవకాశం వుంది ,మహేష్ బిగాల గారికి , అన్ని దేశాల అద్యక్షులని సోషల్ మీడియా లో మన కార్యకర్తలందరికీ డేటా ఇచ్చి బీజేపీ చేసే అబద్దాలను తిప్పికొట్టాలని కోరారు. ఈ రాబోయే 5 రోజులలో గట్టిగా ప్రచారం చేసి గెలుపుకు కృషి చెయ్యాలని కోరారు. ఏప్రిల్ 27 తెరాస ప్లినరీ కి ఎన్నారైలను వచ్చే అవాకాశం ఉంటే పిలవాలని చెప్పారు .
మహేష్ బిగాల మాట్లాడుతూ న్యూజెర్సీలో టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధి – శ్రీ దేవేందర్ రెడ్డి నల్లమడ, టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా- జాయింట్ సెక్రటరీ – శ్రీ రమణ రెడ్డి కంకనల, ,టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా VIce ప్రెసిడెంట్- సత్యం గురిజపల్లియం తెరాస కుటుంబ సభ్యులకి నివాళులు అర్పించారు,మహేష్ బిగల గారు ఆయన సభ్యత్వాన్ని తీసుకొని , అన్ని తెరాస శాఖల కార్యకర్తలకు తెరాస సభ్యత్వం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. కవితక్కా గారి సూచనల మేరకు అన్ని దేశాల ప్రతినిధులను ఏప్రిల్ 27 నాడు పాల్గొనే విదంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు, మన రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పల్లా గారిని , వాణి గారిని గెలిపించాలని కోరారు . ఎన్నారైల పాత్రా ఉండాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసారు .
ఈ కార్యక్రములో ప్రపంచ వ్యాప్తంగా వున్నా తెరాస ప్రతినిధులు అనిల్ కూర్మాచలం , కాసర్ల నాగేందర్, విజయ్ కోసిన, జగన్ వాడ్నలా ,శామ్ బాబు ఆకుల , జువ్వాడి శ్రీనివాస్ ,అశోక్ దుసారి , నాగరాజు గుర్రాల,మహిపాల్ రెడ్డి, సతీష్ రాధారపు,కోమాండ్ల కృష్ణ , శ్రీధర్ అబ్బగోయినా , టోనీ జన్ను ,అరవింద్ గుంత శ్రీధర్, చిట్టి బాబు , ,వెంగల్ జలగం , రాజేష్ మాదిరెడ్డి ,నవీన్ , అభిలాష , సుధీర్ జలగం ,అహ్మద్ షేక్ ,నరేందర్ రెడ్డి మరియు మిగితా తెరాస ప్రతినిధులు ప్రసంగించి అందరూ సూచనలు చేస్తూ , పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారని అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకు అన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారని పేర్కొన్నారు.