అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు యువతీయువకులతో పాటు డల్లాస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రవాస విద్యార్థులకు తానా ద్వారా అందజేసే సేవలను విస్తరించి, వారికి కెరీర్ పరమైన మార్గనిర్దేశనం చేసే కార్యక్రమాల ఏర్పాటుకు కృషి చేస్తానని తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి అభ్యర్థిగా బరిలో ఉన్న కొమ్మన సతీష్ TNIతో అన్నారు. తానా ఆధ్వర్యంలో సాంస్కృతిక, సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సరైన ప్రాధాన్యం ఇస్తూనే తదుపరి తరానికి తానాను చేరువ చేసే ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన సతీష్ 2006లో ఉద్యోగరీత్యా డల్లాస్ వచ్చి అర్వింగ్‌లో స్థిరపడ్డారు. 2008 నుండి తానాతో అనుభవం కలిగిన ఆయన 2012లో తానా జీవిత కాల సభ్యత్వం తీసుకున్నారు. 2013 తానా సభల్లో ఆహార కమిటీ సభ్యుడిగా సేవలందించారు. 2015లో పర్యాటకుల ఆరోగ్య బీమా సేవల కమిటీకి ఉపాధ్యక్షుడిగా తొలిసారిగా తానాలో బాధ్యతలు నిర్వహించారు. 2019-21 మధ్య తానా చైతన్య స్రవంతి జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన డల్లాస్‌లో తానా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కోవిద్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న 500 మంది విద్యార్థులకు నిత్యావసరాలను అందజేయడంతో పాటు, మరో 3000 భోజనాలను నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు అందజేశారు. తనను గెలిపించి అవకాశం కల్పిస్తే టాంటెక్స్ తదితర స్థానిక తెలుగు సంఘాలతో తానాను అనుసంధానించి డల్లాస్ స్థానిక తెలుగువారిని ఒకేతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని అంటున్నారు. అయన చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఆయనకు సంబంధించిన మరిన్ని విశేషాలు దిగువ పరిశీలించవచ్చు…
విద్యార్థులకు సేవలపై దృష్టి సారిస్తాను-TNIతో కొమ్మన సతీష్
Related tags :