తానా 2021-23 అధ్యక్ష పీఠానికి జరుగుతున్న ఎన్నికల్లో ఇరువురు అభ్యర్థులు ఈ వారాంతం సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల్లో ఒకరైన శృంగవరపు నిరంజన్ శనివారం సాయంత్రం కొలంబస్ ప్రవాసులను కలుసుకుని వారి మద్దతును అభ్యర్థించారు. ఆశ్రితపక్షపాతానికి తానాలో చోటులేదని, పనిచేసేవాడికే తమ ప్యానెల్ పట్టం కడుతుందని అన్నారు. తమ ప్యానెల్‌లో యువతరానికి పెద్దపీట వేశామని…శశాంక్, అశోక్, శిరీష లాంటి యువతరానికి అభ్యర్థిత్వం ఇచ్చి తమ ప్యానెల్ ఉద్దేశాన్ని ఘనంగా చాటమని అన్నారు. తదుపరి అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా ప్రచారయాత్ర ఒహాయో నుండి ప్రారంభించడం ఆనవాయితీ అని దానిలో భాగంగా కొలంబస్ ప్రజలతో మమేకం అయి వారికి తమ గళాన్ని వినిపించే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి హాజరయిన ప్రవాసులు నిరంజన్ ప్యానెల్ ప్రణాళికకు సంఘీభావాన్ని తెలిపారని ఆయన ప్యానెల్ సభ్యులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇతర పోటీదారులు గుదే పురుషోత్తమ చౌదరి, ఉమ కటికి, రాజా కసుకుర్తి, ప్రవాసులు వేమూరి సతీష్, సుమంత్ రామిశెట్టి, వడ్లమూడి రవిచంద్ర(నాని), అట్లూరి శ్రీ స్థానిక ప్రవాస ప్రముఖులు పాల్గొన్నారు. సామినేని రవి, యలవర్తి శ్రీని, కాట్రగడ్డ కృష్ణ, నెక్కంటి చౌదరి, చావా శివ తదితరులు ఈ సదస్సు నిర్వహణను సమన్వయపరిచారు.
నిరంజన్ ప్యానెల్‌కు సంఘీభావంగా కొలంబస్ ప్రవాసులు
Related tags :