కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి 2021 తానా ఎన్నికల్లో బరిలో ఉన్న డెట్రాయిట్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు శృంగవరపు నిరంజన్ ప్యానెల్ శుక్రవారం సాయంత్రం ఒహాయో రాష్ట్ర క్లీవ్‌ల్యాండ్‌లో పర్యటించింది. కోవిద్ నిబంధనలకు అనుగుణంగా సాగిన ఈ సభలో నిరంజన్ మాట్లాడుతూ మార్పు కోసం యువతకు పెద్దపీట వేసిన ప్యానెల్ తమదేనని, అమెరికన్ యువతకు తానాకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామని అన్నారు. దీనికి ఉదాహరణగా వారి ప్యానెల్‌లో తదుపరి తరం క్రీడాకారుడు యార్లగడ్డ శశాంక్‌కు అవకాశం కల్పించిన అంశాన్ని ఉటంకించారు. తానాలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నిలబెట్టేందుకు తమ ప్యానెల్ కట్టుబడి ఉంటుందని, క్లీవ్‌ల్యాండ్ ప్రవాసుల మద్దతును కోరారు. కొమ్మినేని శరత్, వడ్లమూడి రవిచంద్ర(నాని), పంగులూరి రామారావు, షేక్ సలీమ్, చెట్టిభక్తుని దుర్గాప్రసాద్, బొడ్డు నరేష్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నిరంజన్ ప్యానెల్ నుండి తానా కార్యదర్శిగా గెలుపొందిన వేమూరి సతీష్, కొల్లా అశోక్‌బాబు, తూనుగుంట్ల శిరీష, రాజా కసుకుర్తి, ఓరుగంటి శ్రీనివాస్, సుమంత్ రామిశెట్టి, శ్రీ చౌదరి, గుదే పురుషోత్తమ చౌదరి తదితరులు హాజరయ్యారు. 100మందికి పైగా ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరంజన్ ప్యానెల్‌కు మద్దతు తెలిపారు. నేటి సాయంత్రం కొలంబస్‌లో జరుగుతున్న కార్యక్రమానికి తానా తదుపరి అధ్యక్షుడు అంజయ్య చౌదరి, కాకర్ల సురేష్, యార్లగడ్డ రాజేష్, శశాంక్ యార్లగడ్డ తదితరులు హాజరు కానున్నారు. సామినేని రవి, సంగా శ్రీనివాస్, యలవర్తి శ్రీనిలు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
క్లీవ్‌ల్యాండ్‌లో నిరంజన్ ప్యానెల్ పర్యటన
Related tags :