కథానాయకుడు మంచు మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మనోజ్‌కు కాబోయే సతీమణి మంచు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలంటూ వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. కాగా, తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై తాజాగా మనోజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని వ్యంగ్యంగా చెప్పారు. ‘పెళ్లి తేదీ, ముహూర్తం జరిగే సమయం కూడా మీరే చెప్పేయండి’ అంటూ కామెంట్ చేశారు. మనోజ్ పెట్టిన ట్వీట్‌తో ఆయన పెళ్లి వార్తల్లో నిజంలేదని అందరూ అనుకుంటున్నారు.
రెండో పెళ్లిపై మనోజ్…
Related tags :