NRI-NRT

ఉగాదికి “తానా మహాకవి సమ్మేళనం-21”

TANA Ugadhi Kavi Sammelanam 2021 From 21 Countries

తెలుగు సాహిత్య చరిత్రలోనే అపూర్వమైన రీతిలో ఉగాది సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో “తెలుగు మహాకవి సమ్మేళనం 21″ అనే కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తున్నట్లు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సాహిత్య వేదిక సమన్వయకర్ చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా మహిళా విభాగపు సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ ప్రకటించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – 21 దేశాలలోని 21 తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక కవి సమ్మేళనం కవితాగానంతో, విశిష్ట అతిధుల సందేశాలతో, అంతర్జాల దృశ్య సాహిత్య సమావేశం నిర్విరామంగా 21 గంటల పాటు సాగుతుందని తెలిపారు. తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించటం, ప్రపంచంలోని తెలుగు కవులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఒకే గొంతుగా తెలుగుభాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఇంతటి బృహత్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ వెల్లడించారు.
ఉగాదికి తానా మహాకవి సమ్మేళనం-21-TANA Ugadhi Kavi Sammelanam 2021 From 21 Countries