స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్,
వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు.
రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.
కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు.
మళ్ళి కొంతసేపు అయిన తరువాత,
విపరీతమైన గాలివాన, వర్షం..
దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేకఆగిపోయాడు.
భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ..ఆ డాక్టరు.
కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది.
ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు
ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె
తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని,
బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని,
వెచ్చగా ఉండేందుకు టీ,
కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది.
ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు.
ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు.
ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప,
ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.
ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని,
తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు.
ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది.
“ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు.
అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది.
ఎంతో మంది వైద్యులకు చూపించాము.
ఎవ్వరూ నయం చేయలేకపోయారు.
ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు,
ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు.
అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి,
భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను
అని చెప్పింది.
వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు.
“భగవంతుడు దయామయుడు.
ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు,
ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి,
గాలివానలో చిక్కుకుని,
నేను మీ ఇంటికి వచ్చాను.
కాదు కాదు,
ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు.
ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే.” అని బదులిచ్చాడు.
అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు.
ప్రార్ధన లోని మహత్యం అదే.
మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.
1.అడగడం,
2. నమ్మడం,
3.అందుకోవడం…ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు.