* బందరు లో నారా లోకేష్….తాడేపల్లి కోడికత్తి రెడ్డి గారు,బందరు తాపీకత్తి నాని గారు అధికారంలోకి వచ్చి 21 నెలలు అయ్యింది.బందరు లో పీకింది ఏంటి?ఆయన కోడికత్తి డ్రామా.ఈయన తాపీకత్తి డ్రామా వేసారు తప్ప చేసింది జీరో.తాపీకత్తి నానీ బందరుని భ్రష్టు పట్టించాడు.నాని అంటే ఏంటో తెలుసా నాకెంత?నీకెంత?ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పనిని ముగ్గురు నానీలకు అప్పగించారు జగన్ రెడ్డి.ఆ ముగ్గురు ఎవరు?ఒకరు బూతుల శాఖ మంత్రి …గుడివాడ గెడ్డం గ్యాంగ్ నాని,రెండు అబద్దాల శాఖ మంత్రి బందరు నాని,మూడు అనారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.గుడివాడ నాని సన్న బియ్యం సన్నాసి,బందరు నాని నోరిప్పితే అబద్దం,కనీసం సొంత ఊరిలో ప్రజల ప్రాణాలు కాపాడలేని ఏలూరు ఆళ్ల నాని.బందరు నాని గారి మాటలు పీక్…మ్యాటర్ వీక్…కరెంటు బిల్లు ఎక్కువొచ్చిందయ్యా అని నియోజకవర్గంలో పేదలు అడిగితే .కలర్ టీవీ వాడితే కరెంటు బిల్లు ఎక్కువొస్తుందని చెప్పిన మెదడు మోకాలులో ఉన్న మంత్రి వుండటం మన ఖర్మ.బందరుని అభివృద్ధి బాట పట్టించేందుకు టీడీపీ హయాంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.మచిలీపట్నంలో ప్రధాన సమస్య డ్రైనేజీ సమస్య సరిగా లేకపోవడం.దీన్ని సరిదిద్దేందుకు మేం చేపట్టిన కొన్ని కార్యక్రమాలను మధ్యలో వదిలేశారు.టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన పనులు అలాగే మిగిలి ఉన్నాయి.తట్ట మట్టి కూడా ఎత్తలేదు.మంచి నీటి సమస్యను తీర్చేందుకు గత ప్రభుత్వం ట్యాంకులను నిర్మిస్తే ఇప్పటివరకు వాటిని వాడుకలోకి తీసుకురాక పోవడం ఏంటీ..?నానీ గారూ.. బందరు ప్రజలకు మేం కట్టిన వాటర్ ట్యాంకుల నుంచి మంచి నీళ్లిస్తే మంచి నీళ్లే ఇచ్చారంటారు తప్ప.. టీడీపీ నీళ్లు అనో.. కొల్లు రవీంద్ర నీళ్లనో అనరు.. మా మీద.. టీడీపీ మీదున్న కోపాన్ని ప్రజలపై చూపొద్దు.ఇళ్ల పట్టాలిచ్చారు.. ఎందుకు ఆ కాగితాలతో నాలిక గీసుకోవాలా..? స్థలాలు ఎక్కడున్నాయో చూపండి నాని.టిడిపి హయాంలో మచిలీపట్నంలో 4200 టిడ్కో ఇల్లు కట్టాం.వాటిని పేదలకు ఇవ్వలేని చేతగాని మంత్రి బందరు నాని.బందరు నుంచి ఎమ్మెల్యేగా నానిని ఎన్నుకున్నారు.. మంత్రి అయ్యాడు.. బందరుకేమీ చేయకపోవచ్చు.. కనీసం బందరు ఆర్టీసీ బస్టాండ్ కూడా సరి చేయలేకపోయారు.పైగా ఆయన రవాణా శాఖ మంత్రి.రవాణా శాఖ మంత్రి అయ్యుండి కూడా బస్టాండుని బాగు చేయలేకపోయారు నాని.అయ్యా నానీ గారూ మీ శాఖకు చెందిన పనిని.. మీ నియోజకవర్గంలోనే చేసుకోలేపోయారు.. మీరు బందరునేం అభివృద్ధి చేస్తారు..?ఈ రెండేళ్ల వైసీపీ హయాంలో బందరులో ఈ ప్రభుత్వం ఈ పని చేసిందని చెప్పగలిగే దమ్ము నానికి ఉందా..?నిన్న మాట్లాడుతూ అమరావతి లో నీరు,మట్టి,గ్రాఫిక్స్ తప్ప ఏమి లేవంటాడు.జగన్ రెడ్డి ఏమో అక్కడ 90 శాతం పూర్తయిన భవనాలు చాలా ఉన్నాయి.వాటిని పూర్తి చెయ్యడానికి నిధులు కేటాయిస్తా అంటున్నారు.ఇద్దరిలో సన్నాసి కానిది ఎవరో వాళ్లే తేల్చుకోవాలి.అమరావతి లో ఉన్న భవనం మీద నుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపిస్తారో లేక సన్నాసులం అని ఒప్పుకుంటారో వారే తేల్చుకోవాలి.జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వలేని దద్దమ్మకి అమరావతి లాంటి పెద్ద విషయాలు ఎందుకు?21 నెలల్లో ఎం చేసారు అని అడిగితే.. సంక్షేమ పథకాలు అందించామంటారు.ఎవడబ్బ సొమ్మని సంక్షేమ పథకాలు ఇస్తారు.జగన్ జేబులో సొమ్మో.. నాని ఇంట్లో సొమ్మో ఇవ్వడం లేదు.ప్యాంట్ జేబులోని డబ్బులు కత్తిరించి షర్ట్ జేబులో పెడుతోంది ఈ ప్రభుత్వం.. అది కూడా సగం కోసేసి.పాదయాత్రలో పెంచుకుంటూ పోతా అన్నాడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.పెట్రోల్,డీజిల్,నిత్యావసర సరుకుల ధరలు,విద్యుత్ ధరలు,ఇంటి పన్ను…జగన్ రెడ్డి పిల్లి…పిరికోడు….ఆయనకి మోడీ గారిని చూస్తే వణుకు.సీబీఐ,ఈడీ కాదు ఏకంగా ఇంటర్పోల్ దిగింది.అందుకే స్పెషల్ స్టేటస్ అవుట్,విశాఖ ఉక్కు అవుట్,పోర్టులు అవుట్మొన్న ఎదో ఊరెళితే ప్రజలు అడిగారట ప్రత్యేకహోదా ఎక్కడ అని?జగన్ రెడ్డి గారు తెచ్చా కదా అన్నారు అట.ఎప్పుడు సార్ అంటే మన బ్రాండ్ స్పెషల్ స్టేటస్ మందు బాటిల్ తెచ్చా కదా అన్నారు అట.స్పెషల్ స్టేటస్,ప్రెసిడెంట్ మెడల్,ఆంధ్రా గోల్డ్ ఇలా అబ్బో ఆయన తెచ్చిన కంపెనీలు ఎన్నో.బాబు గారి హయాంలో కియా,హెచ్సిఎల్ లాంటి పెద్ద కంపెనీలు వచ్చాయి.జగన్ రెడ్డి హయాంలో దొంగ లిక్కర్ మాఫియా కంపెనీలు వచ్చాయి.ఇసుక దొరకదు.టిడిపి హయాంలో 1200 ఉన్న ట్రాక్టర్ ఇసుక 6 వేలు.ఇసుకను పందికొక్కుల్లా తింటున్నారు వైకాపా నేతలు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు.అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు.ఏపీలో మాత్రం మహిళలకు రక్షణ లేదు.సొంత చెల్లెళ్లు జగన్ రెడ్డి మీద నమ్మకం లేక వేరే రాష్ట్రము వెళ్లిపోయారు.ఒక చెల్లెమ్మ ఢిల్లీ వెళ్ళింది.ఒక చెల్లెమ్మ హైదరాబాద్ వెళ్లారు.దిశ చట్టం అంటూ పాలాభిషేకాలు కానీ ఇప్పటివరకూ ఆ చట్టమే లేదు.సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ చనిపోతే దిక్కులేదు.సంక్షేమ కార్యక్రమాలు బోగస్…కుడి చేత్తో వంద ఇచ్చి ఎడమ చేత్తో వెయ్యి కొట్టేస్తున్నారు.
* పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి కటారియా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
* అయోధ్యలో తమ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిర్మాణాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది కర్నాటక సర్కార్.
* తెలంగాణ సర్కారుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్‌లో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణలో మహిళ ప్రాతినిధ్యం గురించి షర్మిల మాట్లాడారు.తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అందరికీ తెలుసన్నారు.తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని, ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలుసన్నారు.ఉద్యమాల్లో మహిళలది కీలక పాత్ర అని, కానీ ప్రస్తుత తెలంగాణ సమాజంలో స్త్రీల ప్రాతినిధ్యం ఎంత అని ప్రశ్నించారు.అసమానతలు గెలిచి సాధించుకున్న రాష్ట్రంలో అసమానతలు ఉన్నాయని షర్మిల ఆరోపించారు.పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాష్ట్రంలో మహిళలు ఘోరంగా అన్యాయమయ్యారని షర్మిల అభిప్రాయపడ్డారు.
* రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను జెండర్ బేస్డ్ బడ్జెట్‌గా తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా, శిశు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించనున్నట్లు పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక బడ్జెట్ తయారీకి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
* దేశ స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తి, ఇప్పటిదాకా సాధించిన విజయాలను ప్రతిబింబించేలా 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు నిర్వహించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నిర్వహణపై ఏర్పాటైన జాతీయ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమావేశమయ్యారు. ఈ వేడుకల్లో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమన్నారు. యావత్ ప్రపంచానికి మనం సాధించిన విజయాలను ప్రదర్శించే అవకాశం లభించిందన్న ఆయన.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
* అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. మరో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆ నలుగురూ భాజపాలో చేరిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ వీరికి సీటు నిరాకరించడంతో భాజపాలో చేరారు. ఇటీవల 291మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమతా బెనర్జీ 23మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించిన విషయం తెలిసిందే.
* దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలు భగ్గుమంటున్నాయి. ఎన్నడూలేని రీతిలో వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరగడం వల్లే వీటి ధరలు పెరుగుతున్నాయని కేంద్రం చెప్పుకొస్తోంది. అయితే, సిలిండర్ ధరలు ఏమేర పెరిగాయ్? చమురుపై సుంకాల వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరింది? అంటూ పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
* మహారాష్ట్రలో 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై అన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయం తెలపాలని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇందులో భాగంగా, అన్ని రాష్ట్రాలకు తాజాగా నోటీసులు జారీచేసింది. మరాఠా రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్న తీర్పును పరిశీలనకు స్వీకరించిన సుప్రీం కోర్టు కేసును మార్చి 15కు వాయిదా వేసింది.
* అగ్రకథానాయిక సమంత అక్కినేని తన డ్యాన్స్‌తో అభిమానులను ఫిదా చేస్తున్నారు. ‘డోంట్ రష్’ అనే హాలీవుడ్ ప్రైవేట్ ఆల్బమ్‌కు సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ అనూష స్వామితో కలిసి ఆమె స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోని సామ్ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘‘విక్కీకౌశల్ దీనిని మేము చేయగలిగేలా చేశాడు. ఈ అద్భుతమైన మహిళ అనూషకు నా ప్రశంసలు. అనూష.. ఒక ఏడాది సమయం ఇస్తే.. డ్యాన్స్‌లో నేను నీ స్థాయిని చేరుకోగలుగుతాను’’ అని సమంత పేర్కొన్నారు.
* పశ్చిమ బెంగాల్ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. కీలకమైన నేతలు పార్టీని వీడడంతో తృణమూల్ కాంగ్రెస్ ఆత్మస్థైర్యం కొంతమేర దెబ్బతినగా.. అదే సమయంలో కొత్తగా చేరికలతో భాజపా బలం రాష్ట్రంలో పుంజుకుంది. మమత తర్వాత రాష్ట్రంలో నంబర్ 2గా ఉన్న సువేందు అధికారి తృణమూల్‌ను వీడి భాజపాలో చేరడంతో కొంతమేర కమలానికి ఊపు రాగా.. తాజాగా బెంగాల్‌కు చెందిన బాలీవుడ్ నటుడు మిథున్‌చక్రవర్తి చేరికతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది.
* ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కొవిడ్ మహమ్మారి లక్షల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటోంది. అమెరికా, బ్రెజిల్‌తో పాటు యూరప్ దేశాల్లోనూ కొవిడ్ మరణాల రేటు అధికంగా ఉంది. స్థూలకాయులు అధికంగా ఉన్న దేశాల్లోనే కొవిడ్ మరణాల రేటు అధికంగా ఉన్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. స్థూలకాయుల శాతం అధికంగా ఉన్న దేశాల్లో కొవిడ్ మరణాల రేటు 10రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కొవిడ్-19 సోకి మరణిస్తున్న వారిలో ఎక్కువగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
* మన దేశంలో నోట్ల రద్దుకు ముందు రూ. వెయ్యి నోటే అతిపెద్దది. ఆ తర్వాత వాటిని రద్దు చేసి రూ. 2వేల నోట్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిని చూసి చాలా మంది అంతపెద్ద నోటా అని ముక్కున వేలేసుకున్నారు. వందలు, ఐదు వందల నోట్లను కట్టలుగా తీసుకెళ్లే కన్నా.. ఈ రూ. 2వేల నోట్లను తీసుకెళ్తే సులువుగా ఉంటుంది కదా..! ఇదే కారణంతో వెనిజువెలా ప్రభుత్వం ఏకంగా 1 మిలియన్ బొలివర్స్(ఆ దేశ కరెన్సీ) నోట్లను తీసుకురానుంది.
* ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీసు ముందు టీమ్‌ఇండియా యజమాన్యానికి తలనొప్పి మొదలైంది. తుది జట్టులో ప్రతి స్థానానికి ఇద్దరు పోటీపడుతున్నారు. మొత్తం 19 మందిలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రయోగాలు చేస్తారా? ప్రస్తుత సిరీస్ గెలవడమే లక్ష్యంగా అనుభవజ్ఞులనే కొనసాగిస్తారా? జూనియర్లు సీనియర్ల మేళవింపుతో తుది 11 మందిని ప్రకటిస్తారా? కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు నిజంగా ఇది ధర్మ సంకటమే!