చిన్నప్పుడు అమ్మ చెప్పిన చిట్కాల్నే ఇప్పటికీ పాటిస్తున్నా అంటోంది తమన్నా. తన సౌందర్యం వెనకనున్న రహస్యం అదే అని చెబుతోందామె. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న తమన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అందాన్ని కాపాడుకొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటుంటారని అడిగితే… ‘‘అందం గురించి అతి జాగ్రత్తలేమీ తీసుకోను. సాయంత్రం చిత్రీకరణకి ప్యాకప్ చెప్పగానే మేకప్ తీసేసి అచ్చం పక్కింటి అమ్మాయిలా మారిపోతా. సగటు అమ్మాయిలు వాళ్ల అందం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటారో నేనూ అంతే. సినిమా రంగంలో అందం కీలకమే అయినా… దానికి సమానంగా నటనపై కూడా దృష్టిపెడుతుంటా. ఎందుకంటే మేం నటులం కాబట్టి. అయితే ఎవరైనా నా అందం గురించి మాట్లాడినప్పుడు మా తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకొంటుంటా. వాళ్ల వల్లే కదా నేనిలా ఉన్నానని చెబుతుంటా. కథా నాయికలం కాబట్టి సౌందర్య పోషణ గురించి మాకు చాలా తెలుసనుకుంటారు చాలామంది. ఆ విషయంలో అందరిలాగే నేనూ ఇప్పటికీ అమ్మ సలహాల్నే పాటిస్తుంటా’’ అని చెప్పింది తమన్నా. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు చాలానే చేసినా… తాను ఏ పాత్రలోనైనా ఒదిగిపోతాననే ధీమా ‘బాహుబలి’ తర్వాతే కలిగిందని చెప్పుకొచ్చింది తమన్నా.
అన్నీ అమ్మ చిట్కాలే
Related tags :