Business

రెండు రోజులు బ్యాంకు OTPలు బంద్-వాణిజ్యం

Business News - Bank OTP SMS System Disturbed in India

* బ్యాంక్ OTPలూ, ఇతర SMSలు మరో రెండు రోజులు రాకపోవచ్చు!బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు, ఇతర అనేక రకాల కార్యకలాపాలకు మన smartphoneకి OTP వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం అర్థరాత్రి నుండి దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకింగ్ సేవలు, ఇతర అంశాలకు సంబంధించిన OTPలు, SMS మెసేజ్‌లు చాలా మందికి స్తంభించిపోయాయి.దీనికి ప్రధాన కారణం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నియమ నిబంధనలు అందుబాటులోకి తీసుకురావడం! ఇటీవల దేశవ్యాప్తంగా అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, ఫిషింగ్ కాల్స్ వంటివి పెరుగుతూ ఉండడంతో అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడం కోసం TRAI 2019లో కొత్త బ్లాక్ ఛైన్ టెక్నాలజీ ని అమలు పరచాలని టెలికం కంపెనీలను ఆదేశించింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అది పెండింగ్లోనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దానిని తప్పనిసరి చేయడంతో, ఆ సరికొత్త మార్పులను అమలుపరిచే ప్రయత్నంలో టెలికాం కంపెనీల SMS సేవలకు కొంత సమయం పాటు తీవ్ర విఘాతం కలిగింది. ఈ కొత్త నియమాల ప్రకారం ఇకమీదట వినియోగదారులకు SMSలను పంపించే కంపెనీలు, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు, ఆధార్ వంటి సేవలు అందించే గవర్నమెంట్ ఏజెన్సీలు కొన్ని మెసేజింగ్ టెంప్లేట్లని తయారుచేసుకుని అందులో సూచించిన విధంగా మాత్రమే వినియోగదారులకు మెసేజ్లు పంపించవలసి ఉంటుంది. ఈ కొత్త నియమాలు అందుబాటులోకి వచ్చిన దరిమిలా, తాత్కాలికంగా సేవలకు విఘాతం కలగడంతో బ్యాంకులు అతి ముఖ్యమైన మెసేజ్లను పంపించడానికి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశాయి. రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల మీకు ఏదైనా సర్వీసుకి సంబంధించి SMS మెసేజ్ రాకపోతే ఆందోళన చెందకండి. కీలకమైన లావాదేవీలు నిర్వహించడం కోసం ఈ OTPలు తప్పనిసరి అయినప్పటికీ.. కొత్త నియమాల వల్ల స్పామ్ చాలావరకు తగ్గిపోతుంది కాబట్టి తాత్కాలికంగా కలిగిన అసౌకర్యాన్ని భరించక తప్పదు.

* కోవిడ్ -19 మహమ్మారి ఆరోగ్య సంరక్షణ వ్యయాల పెరుగుదల బీమా ప్రాముఖ్యత అంశాన్ని ఇంటికి నడిపించాయి, అయితే ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే మహిళల శాతం పురుషులతో పోలిస్తే ఇంకా తక్కువగా ఉంది. అంతేకాకుండా తాజాగా ఒక‌ నివేదిక ప్రకారం, 71 శాతం మంది మహిళలు ఏదో ఒక అనారోగ్యంతో ఉన్నార‌ని వెల్ల‌డించింది.

* వాణిజ్యపరమైన ఎస్సెమ్మెస్‌లు, ఓటీపీలు అందుకోవడంలో అవాంతరాలు తలెత్తిన నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సందేశాల నియంత్రణ కోసం తెచ్చిన నూతన నిబంధనలను అమలును వారంపాటు వాయిదా వేసింది. దీంతో సంస్థలు టెంప్లేట్‌లను అప్‌డేట్‌ చేసుకునే వీలు దొరుకుతుందని, కస్టమర్లకు ఇబ్బందులుండవని ట్రాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని టెలికాం సంస్థలకు తెలియజేసినట్లు ట్రాయ్‌ పేర్కొంది. లావాదేవీల సమయంలో ఓటీపీలు రావడంలో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

* వాహన పరికరాల తయారీ కంపెనీ క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ లిమిటెడ్‌ మార్చి 15న ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీవో)కు రానుంది. ఒక్కో ఈక్విటీ షేరు ధర శ్రేణిని 1,488-1,490గా నిర్ణయిస్తూ మంగళవారం కంపెనీ ప్రకటన విడుదల చేసింది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 17న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ మార్చి 12 నుంచి ప్రారంభం కానుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీలాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆర్థికరంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకున్న సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. ఉదయం 50,714 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 51,111 వద్ద గరిష్ఠాన్ని, 50,396 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 584 పాయింట్లు లాభపడి 51,025 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,049 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,126 – 14,925 మధ్య కదలాడింది. చివరకు 142 పాయింట్ల లాభంతో 15,098 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.99 వద్ద నిలిచింది.