DailyDose

దిశ చట్టం ఇంకా పరిశీలనలోనే ఉంది-నేరవార్తలు

దిశ చట్టం ఇంకా పరిశీలనలోనే ఉంది-నేరవార్తలు

* దిశ చట్టం పరిశీలన దశలోనే ఉందని కేంద్రం తెలిపింది.ప్రస్తుతం ఈ చట్టం కేంద్ర పరిశీలనలో ఉండగా దానికి సంబంధించిన ప్రశ్నలను వైకాపా ఎంపీలు కేంద్రాన్ని అడిగారు.ఈ ఏడాది జనవరిలో బిల్లు వచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.రాష్ట్ర బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం ఆనవాయితీగా వస్తోందన్నారు.ఈ మేరకు ప్రస్తుతం ఈ బిల్లును సంబంధిత మంత్రిత్వ శాఖలు పరిశీలిస్తున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

* ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‍పై సుప్రీంకోర్టులో విచారణ.ఏప్రిల్ 8లోగా శాఖపరమైన దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశం.ఏప్రిల్ 30లోగా పీసీ యాక్ట్ కేసు దర్యాప్తు పూర్తి చేయాలి.తదుపరి విచారణ మే 3కు వాయిదా.

* ఆసిఫాబాద్ :జిల్లాలోని కాగ‌జ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో మంగ‌ళ‌వారం ఉద‌యం రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది.స్థానికంగా ఉన్న రైల్వే ఫ్లై ఓవ‌ర్‌పై వెళ్తున్న స్కూటీని ఆటో ఢీకొట్టింది.ఈ ప్ర‌మాదంలో స్కూటీపై వెళ్తున్న యువ‌తికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఆమె హెల్మెట్ ధ‌రించ‌డంతో త‌ల‌కు గాయం కాలేదు.అయితే ఆటోలో ఇద్ద‌రు ప్ర‌యాణిస్తున్న‌ట్లు వీడియోలో కనిపించింది.ఓ యువ‌కుడు డ్రైవ‌ర్ ప‌క్క‌న ఆటోకు వేలాడుతూ ఉండ‌గా.. అది బోల్తా కొట్టింది.ఆటో డ్రైవ‌ర్‌కు, ఆ యువ‌కుడికి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుందా? లేక ఆటో అదుపు త‌ప్పిందా? అన్న విష‌యం తేలాల్సి ఉంది.ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

* ప్లాస్టిక్​ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం.మహారాష్ట్ర ఠాణెలోని ఆంసన్​గావ్​ ప్లాస్టిక్​ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.మంటలకు ఆర్పేందుకు 12 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి.తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.ఫ్యాక్టరీలోని సరకు మొత్తం అగ్నికి ఆహుతైనట్లు చెప్పారు.ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

* కృష్ణా జిల్లాప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం.జి.కొండూరు మండలం కుంటముక్కల ఇటుక బట్టిల వద్ద ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు అదుపు తప్పి కట్టు కాలువ లో బోల్తా.బస్సు లో 20 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.గాయపడిన పిల్లలను మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పిల్లలకు డ్రైవర్ కు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు.