Movies

షరతులు లేవు

షరతులు లేవు

ప్రేమలో షరతులు ఉండకూడదనేది తన సిద్ధాంతమని చెబుతోంది ఇలియానా. అదే నిజమైన ప్రేమగా తాను నిర్వచిస్తానని అంటోంది. చిరకాల ప్రేమికుడు, ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో మనస్పర్థల కారణంగా విడిపోయింది ఇలియానా. ప్రస్తుతం ఏకాంత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని ఇలియానా చెబుతూ ‘ప్రేమ అనేది అన్‌ కండిషనల్‌గా ఉండాలి. షరతులతో కూడిన ప్రేమ ఎక్కువ కాలం నిలబడలేదు. ఎదుటివారిలోని తప్పొప్పుల్ని నిస్వార్థంగా స్వీకరించగలిగే గొప్ప గుణం ఉండాలి. అంతేకానీ ప్రతి విషయాన్ని జడ్జ్‌ చేయకూడదు. అలాంటి మంచి మనసున్న వారినే నేను ఇష్టపడతా. కృత్రిమ అందాలతో పోలిస్తే సహజ సౌందర్యాన్ని నేను అమితంగా ఆరాధిస్తా. అందుకే అందాన్ని ఇనుమడింపజేసే సర్జరీలకు నేను వ్యతిరేకం. చర్మ సౌందర్యం కోసం ఇప్పటివరకు ఎలాంటి సర్జరీలు చేసుకోలేదు’ అని తెలిపింది. కరోనా కారణంగా విహారయాత్రలపై ఆసక్తి తగ్గిపోయిందని, ఇంట్లోనే ఒంటరి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నానని చెప్పింది ఇలియానా.