WorldWonders

మధ్యప్రదేశ్‌లో మద్యం కొట్టు వేలం…₹512కోట్లు

మధ్యప్రదేశ్‌లో మద్యం కొట్టు వేలం…₹512కోట్లు

మీరు చదివింది అక్షరాలా నిజం. ఎలాంటి అచ్చు తప్పులు లేవు. లక్షల్లో ప్రారంభమైన వైన్ షాపు ధర అమాంతం 510 కోట్ల రూపాయలు పలికింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అర్థరాత్రి 2 గంటల వరకు సాగిన ఈ వేలం పాటలో సదరు షాపును ఇద్దరు మహిళలు దక్కించుకున్నారు. వాళ్లిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన మహిళలు కావడం గమనార్హం.మధ్యప్రదేశ్ లోని హనుమాన్ ఘర్ జిల్లాలోని ఓ ఊరిలో ఈ రికార్డ్ స్థాయి వేలం పాట జరిగింది. 72 లక్షల ప్రారంభ ధర వద్ద మొదలైన వేలం పాట అర్థరాత్రి 2 గంటల వరకు సాగి అమాంతం 510 కోట్ల రూపాయలకు చేరుకుంది. వేలం పాటలో వైన్ షాపును రికార్డు ధరకు దక్కించుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళల్లో ఒకావిడ పేరు కిరణ్ కన్వర్. ఇలా భారీ రేట్లకు వైన్ షాపులు వేలం పాడడం ఈ జిల్లాలో కామన్. అయితే ఈ రేటు మాత్రం మరీ ఓవర్. స్వయంగా ఎక్సైజ్ అధికారులే నోరెళ్లబెట్టారు. పాడిన మొత్తంలో 2 శాతంను ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 శాతం ఎమౌంట్ కూడా ఎక్సైజ్ శాఖకు చాలా ఎక్కువ.మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. గతేడాది ఈ షాపు వేలం పాట కేవలం 65 లక్షలకే క్లోజ్ అయింది. ఏడాది తిరిగేసరికి 510 కోట్లకు చేరుకుంది.ప్రస్తుతం రాష్ట్రంలో 7665 షాపులకు వర్చువల్ బిడ్డింగ్ రూపంలో ఆక్షన్ నడుస్తోంది. నిజానికి వసుంధర రాజె టైమ్ లో దీనిపై బ్యాన్ ఉండేది. అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మళ్లీ మొదలైంది.