పంట పండించిన అనంతరం సరుకు రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడుతూ నష్టాలు చవిచూస్తున్న నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన రైతుల ప్రయోజనల నిమిత్తం ప్రవాసులు వల్లేపల్లి శశికాంత్, బొబ్బ రామ్‌లు మంగళవారం నాడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ₹25లక్షలను అందజేశారు. రైతుల నేపథ్యంలో 14రీల్స్ బ్యానర్‌పై శర్వానంద్ హీరోగా, ఆచంట గోపీ, ఆచంట రామ్‌లు నిర్మించిన “శ్రీకారం” చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా ఈ మొత్తాన్ని శశికాంత్, రామ్‌లు కేటీఆర్‌కు అందజేశారు. ఈ మొత్తాన్ని రైతులు సరకు రవాణా చేసుకునేందుకు వీలుగా వాహనాల కొనుగోలుకు వినియోగించనున్నారు. రైతుల దుస్థితిని తప్పించాలని వారి శ్రేయస్సు కోరి విరాళం అందజేసిన ప్రవాసులు ఇరువురికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
నల్గొండ రైతులకు ₹25లక్షలు విరాళం ఇచ్చిన ప్రవాసులు
Related tags :