మొన్న కొలంబస్‌లో రెండు ప్యానెళ్ల తరఫున పోటీ పడుతున్న కోశాధికారి అభ్యర్థులు కొల్లా అశోక్, ప్రభల జగదీష్ ఒకరిని ఒకరు మర్యాదపుర్వకంగా కలుసుకున్న సంఘటన (https://www.tnilive.com/?p=81253) మరవకముందే తానా 2021 ఎన్నికల్లో ఇలాంటి మరో ఆరోగ్యకర సంఘటన డెట్రాయిట్‌లో జరిగింది. తానా 2021 అధ్యక్ష అభ్యర్థులుగా బరిలో ఉన్న గోగినేని శ్రీనివాస, నిరంజన్ శృంగవరపులు డెట్రాయిట్ ప్రాంతానికి చెందినవారు. నిరంజన్ ప్యానెల్ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన తానా తదుపరి కార్యదర్శి వేమూరి సతీష్ డెట్రాయిట్ పర్యటనకు వచ్చారు. గోగినేనికి వేమూరికి దీర్ఘకాలంగా స్నేహం ఉంది. ఈ పరిచయంతోనే వేమూరిని కలిసేందుకు వెళ్లిన గోగినేనికి అక్కడ నిరంజన్ తారసపడినట్లు సమాచారం. ముగ్గురు తానా నేతలు సరదాగా ఒకే టెబుల్ వద్ద కూర్చుని కాసేపు ముచ్చట్లు ఆడుకున్నారు. ప్రచార సరళి, ఓటర్ల ఆలోచనా విధానం తదితర అంశాలపై చర్చించుకున్నారు. తానాలో ఎన్నికల వరకే రాజకీయ, ప్యానెళ్లు గానీ నిజజీవిత సంబంధాలు మనుషుల మధ్య దూరాన్ని పెంచలేవని ఈ సమావేశం నిరూపిస్తుందని తానా సభ్యులు భావిస్తున్నారు.
డెట్రాయిట్‌లో తానా అధ్యక్ష అభ్యర్థుల ముచ్చట్లు
Related tags :