Politics

అమెరికా నుండి ఓటు వేయడానికి వచ్చిన అనంత యువతి

Ananthapuram Girl Comes Back From USA To Vote

ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత. మన తల రాతల్ని మార్చేసే నాయకుల రాతలను ఒక్క ‘సిరా చుక్క’తో మార్చేసే అవకాశం ఓటుతోనే వస్తుంది.

చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి శ్రద్ధ చూపించరు. ‘‘ఓటు వేయడం నా ఇష్టం.. నేను వేస్తే వేస్తాను..లేకపోతే లేదు’’ అనుకుంటారు.

కానీ ఉన్నత విద్య కోసం అనంతపురం నుంచి అమెరికాకు వెళ్లిన ఓ యువతి.. నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు.

ఓటు ఎంత విలువైందో చాటిచెప్పారు. ఆమె ఎవరో కాదు.. సాక్షాత్తూ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సోదరుడు అనంత సుబ్బారెడ్డి కుమార్తె అనంత మహిమ.

అమెరికా నుంచి మంగళవారం అనంతపురం చేరుకున్న ఆమె.. బుధవారం తన పెదనాన్న అనంత వెంకట రామిరెడ్డితో కలసి ఓటు వేశారు.

కోర్టు రోడ్డులోని నెహ్రూ స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతటి విలువైనదో నిరూపించారు.

మన ఊరి అభివృద్ధి కోసం, భావి తరాల ఉజ్వల భవిత కోసం ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అనంత మహిమ కోరారు.