సూప్… అల్పాహారం… కర్రీ, చారు, మిక్చర్, భజ్జీ… ప్రతిదానిలోనూ పచ్చిమిరప ఉండాల్సిందే. వంటకమేదైనా స్పైసీ కోరుకునేవారు పచ్చిమిరపను బాగా అభిమానిస్తారు. ఇందులో కూడా ఎన్నో పోషకాలు, ఔషధగుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.పచ్చి మిరపకాయల్లో కేలరీలు లేవు కానీ. ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. పచ్చిమిరపకాయలను తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడి కల్స్ను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తాయి. దీంతో రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథిó సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం గుండెకు పచ్చిమిరప రక్షణ కవచం. రక్తంలో కొలెస్టరాల్, ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. మిరపకాయలలో మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది బ్రెయిన్లోని హైపోథాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. జలుబు, సైనస్ ఉన్న వారికి పచ్చిమిరప మంచి సహజ ఔషధం. మెంబ్రేన్లకు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తుంది. మెంబ్రేన్ అనేది ఒక టిష్యూ. ఇందులో శ్లేష్మం (మ్యూకస్) ఏర్పడడాన్నే సైనస్. క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా జరిగి మెంబ్రేన్లలో శ్లేష్మం పలచబడుతుంది. దీంతో ఉపశమనం లభిస్తుంది. రక్తంలో షుగర్ స్థాయుల్ని పచ్చిమిరప నియంత్రిస్తుంది. అందుకే మధుమేహులు ప్రతిరోజూ తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్న వారికి మిరప మంచి ఔషధం. పచ్చిమిరపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి. అందుకే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి.
పచ్చిమిరప సూప్ తాగారా?
Related tags :