* దేశంపై కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది.ఒక్కరోజులోనే 22,854 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.బాధితుల సంఖ్య 1కోటీ 12లక్షల 85వేలు దాటింది. మరో 126మంది మహమ్మారికి బలయ్యారు.మొత్తం కేసులు: 1,12,85,561మొత్తం మరణాలు: 1,58,189యాక్టివ్ కేసులు: 1,89,226కోలుకున్నవారు: 1,09,38,146తాజాగా సుమారు 18వేల 100 మంది వైరస్‌ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.దేశవ్యాప్త రికవరీ రేటు 96.92 శాతంగా నమోదవ్వగా.. మరణాల రేటు 1.40శాతంగా ఉందని వివరించింది.
* తీవ్ర ఉద్రిక్తత నడుమ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులుకొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండిస్తూ ఆందోళనకి దిగిన టీడీపీ కార్యకర్తలుమాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర కామెంట్స్వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నఒదుకు నాపై అక్రమ కేసులు పెడుతున్నారునిన్న నా ఓటు హక్కును వినియోగించు కునేందుకు వెళ్లిన నాపై వైసీపీ వారే దురుసుగా ప్రవర్తించారునేను ఎక్కడికి వెళ్ళడానికి లేదని హౌస్ అరెస్ట్ అని చెపితే నేను ఇంట్లోనే ఉన్నానుఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను పోలీసులు మీడియాతో మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు పెట్టారుసంబంధం లేని వాటిల్లో నన్ను ఇరికించి కావాలని కేసులు పెడుతున్నారుగతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదుప్రజాస్వామ్యం ఏమౌతుందో అర్ధం కావడం లేదు
* కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి.. మరో సారి పంజా విసురుతోంది. నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించగా.. తాజాగా మరోసారి లాక్‌డౌన్ విధేంచేందుకు సిద్ధమైంది. నాగ్‌పూర్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 15-21 వరకు నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
* మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ప్రీసైడింగ్ అధికారుల నియామకం జరగనుంది. జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్లను ప్రీసైడింగ్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటి కంటే ఎక్కువ ఉన్న చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లను ప్రీసైడింగ్ అధికారులుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించారు.
* ఈ నెల 17న సచివాలయంలో అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యుల ఎంపిక కోసం సమావేశం. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో సమావేశానికి రావాల్సిందిగా సమాచారం పంపిన సీఎస్ కార్యాలయం. కమిటీ సభ్యులుగా చంద్రబాబు, మండలి చైర్మన్ షరీఫ్.
* భారత్‌లో మళ్లీ భారీగా కోవిడ్ కేసులు.. గత 24 గంటల్లో 22,854 కొత్త పాజిటివ్ కేసులు నమోదు, 126 మంది మృతి, 18,100 మంది రికవరీ.. దీంతో.. 1,12,85,561కు చేరిన పాజిటివ్ కేసులు, 1,09,38,146 మంది రికవరీ.. ఇప్పటి వరకు 1,58,189 మంది మృతి
* ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,803 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 174 కేసులు నిర్ధారణ అయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,91,178కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,179 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 78 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,841కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,158 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,44,03,941 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
* తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలువురు ప్రముఖులతో పాటు, సొంత పార్టీల్లో చోటు దక్కని ఆశావహులు ఇతర పార్టీలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు సెంథిల్ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
* సైబరాబాద్ పోలీసులు కొత్త చట్టాన్ని ప్రయోగించనున్నారు. ఇప్పటి వరకు మద్యం తాగి వాహనాలను నడిపేవారిపైనే కేసు నమోదు చేస్తున్న పోలీసులు.. ఇకపై కొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. తాగిన వ్యక్తి నడిపే వాహనంలో ప్రయాణించే వారిపైనా కేసు పెట్టబోతున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసీ ఆ వాహనంలో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.