తానా 2021 ఎన్నికల్లో చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. సంస్థలో దాతలకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విభాగంలో ఫౌండేషన్‌కు ఈసారి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వల్లేపల్లి శశికాంత్, నల్లూరి ప్రసాద్, గారపాటి విద్యా, అమిర్నేని కిరణ్‌లు తానా ఫౌండేషన్ ట్రస్టీలుగా డోనర్ కేటగిరీలో పోటీ పడుతున్నారు. డోనర్ కోటాలో ఉన్న రెండు పదవులకు నలుగురు పోటీ పడటం ఒక విచిత్రం కాగా అసలు తానా డోనర్ కోటాలో ఓటు హక్కు కలిగిన కుటుంబాలు 62మంది (124 ఓట్లు) మాత్రమే ఉండటం మరో విచిత్రం.
###################