Politics

టూర్ వాయిదా వేసుకున్న నిమ్మగడ్డ-తాజావార్తలు

Nimmagadda Postpones Personal Tour To Arunachal Pradesh

* వ్యక్తిగత పర్యటన వాయిదా వేసుకున్న ఎస్‍ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.ఈ నెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కారణంగా వాయిదా.గతంలో 17వ తేదీ నుంచి 24 వరకూ గవర్నర్‍ను సెవలు కోరిన ఎస్‍ఈసీ.ఎల్టీసీపై మధురై-రామేశ్వరం వెళ్లనున్నట్టు గవర్నర్‍కు తెలిపిన ఎస్‍ఈసీ.ఈ నెల 19 నుంచి 22 వరకు సెలవు ఇవ్వాలని తాజాగా ఎస్‍ఈసీ విజ్ఞప్తి.

* దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం.2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 యేళ్లు అవుతున్న సందర్భంగా వేడుకలు.ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించిన సీఎం వైయస్‌.జగన్‌.జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించిన సీఎం.మాచర్లలో నివాసముంటున్న పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి.సీతామహాలక్ష్మి నివాసానికి వెళ్లి ఆమెను సత్కరించి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్.

* తెలంగాణాలో జ‌ర‌గ‌నున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల ప్ర‌చారానికి నేటితో తెర‌ప‌డనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు సాయంత్రం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మ‌ద్యం దుకాణాలు మూతపడనున్నాయి.ఈ మేరకు తెలంగాణ‌ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు. వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలతో పాటు క్లబ్బులు మ‌ళ్లీ ఎల్లుండి సాయంత్రం 4 గంట‌ల త‌ర్వాతే తెరుచుకుంటాయి. ఈ నెల 14న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి ఎన్నిక‌లకు ఈ రోజు సాయంత్రం 4 గంటల వ‌రకే ప్ర‌చారం చేసుకునేందుకు వీలుంది.ఈ రెండు స్థానాల‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఈ నెల 17న కూడా మ‌ద్యం దుకాణాల‌ను మూసి వేయాల్సిందే. ఈ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల‌ను రాజ‌కీయ పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా గ‌ట్టిపోటీనిచ్చే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

* వైసీపీ కీలక నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఓటమిపాలైన తర్వాత చంద్రబాబులో చాలా మార్పులు వచ్చాయని… వ్యక్తిగత దూషణలకు దిగుతూ జుగుప్సాకరమైన భాషను వాడుతున్నారని అన్నారు. హత్యా రాజకీయాలను నడుపుతున్నారని విమర్శించారు.కుప్పం పర్యటన సందర్భంగా ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కీలక నేతలను బెదిరిస్తున్నారని… ఆయన మాటలకు ఎవరైనా మనస్తాపానికి గురై… ప్రతిస్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

* ఆంధ్రప్రదేశ్ లో దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడులపై త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆల‌యాల‌పై దాడుల‌కు ప‌రాకాష్ఠ రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హ ధ్వంసం అని చెప్పారు. ఈ రోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ… ఆల‌యాలు మ‌న ధ‌ర్మానికి మూల కేంద్రాల‌ని చెప్పారు.దేవాల‌యాల‌పై ఆధార‌ప‌డే అన్ని క‌ళ‌లు జీవిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. కాగా, క‌రోనా నుంచి విముక్తి క‌ల‌గాలని తాను శ్రీవారిని ప్రార్థించాన‌ని చెప్పారు. కాగా, తిరుప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిన్న చిన‌జీయ‌ర్ స్వామి తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి తాము నివేదిక అందించనున్నామని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో పోస్కో కంపెనీ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ మిగులు భూముల్లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పోస్కో ఆసక్తి చూపుతోంది. ఈ అంశంలో అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి మధ్య విమర్శల పర్వం కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోస్కో సంస్థ తిరుమల వెంకన్నకు భారీ విరాళం ప్రకటించింది.తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో సంస్థ సీఈఓ సంజయ్ పాసి రూ.9 కోట్ల విరాళం అందించారు. ఇవాళ ఉదయం సతీసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకున్న సంజయ్ పాసి, ఆపై విరాళం తాలూకు డీడీలను టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందించారు.

* ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ ఎమ్మెల్సీ ఓట్లకు డబ్బులు పంచున్న ఓ వ్యక్తి పట్టుకున్న యుటీఎఫ్ నాయకులు.

* కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్‌ కేసు బయటపడింది. కొన్నిరోజుల కిందట దుబాయ్‌ నుంచి బెంగళూరులో దిగి అక్కడి నుంచి శివమొగ్గకు వెళ్లిన వ్యక్తి (53)కు కొత్త కరోనా సోకినట్లు నిర్ధారించారు. శివమొగ్గలో ఇంట్లో వారంరోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న తరువాత బయటకు వచ్చి తిరిగాడు. అనుమానంతో మరోసారి కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని వెల్లడైంది. కొత్త రకం కరోనా అని పరీక్షించగా దక్షిణాఫ్రికాలో ఇటీవల గుర్తించిన స్ట్రెయిన్‌గా తేలింది. బాధితుడికి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా వైద్యమందిస్తున్నారు.

* నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12 వ వార్డు పోలింగ్ ఓట్ల పై గందరగోళం.పోలింగ్ అధికారి పోలింగ్ ఓట్లకు…సహాయ ఎన్నిక అధికారి పోలింగ్ ఓట్లకు మధ్య 59 ఓట్ల తేడా వస్తున్న వైనం.సహాయ ఎన్నిక అధికారి, నంద్యాల మున్సిపల్ కమీషనర్ వెంకట కృష్ణ ని కలసి స్వతంత్ర అభ్యర్థి శ్యామ సుందర్ లాల్ మరియు ఎంఐ ఎం అభ్యర్థి అక్బర్.పోలింగ్ ఆఫీసర్ వివరణ కోరిన సహాయ ఎన్నికల అధికారి వెంకట కృష్ణ.మధ్యాహ్నం 3 గంటలకు వివరాలు వెల్లడిస్తామని తెలిపిన సహాయ ఎన్నికల అధికారి.అలాగే కౌంటింగ్ ఏజెంట్ల నియామకంపై జిల్లా వ్యాప్తంగా ఒక పద్ధతి…నంద్యాలలో మరో పద్ధతికౌంటింగ్ కు రెండు టేబుల్స్…అభ్యర్థితో పాటు ఒకరికి మాత్రమే అనుమతి ఇస్తామని చెబుతున్న సహాయ ఎన్నికల అధికారి.

* ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ రాశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధానిని కోరారు. స్వాంతంత్య్ర సమరయోధుడుగా కీలకమైన పాత్ర పోషించిన పింగళి వెంకయ్య సేవలకు తగిన గుర్తింపు దక్కలేదని సీఎం పేర్కొన్నారు.

* కొవిడ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎంతగా పతనమైందో తెలిసిందే. దీంతో వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు బడా కంపెనీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌, హవేల్స్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగుల కొవిడ్‌ టీకా ఖర్చులను భరించేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఈ జాబితాలో చేరింది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు టీకాలను ఇప్పించనుంది.

* పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమవుతోన్న యాదాద్రి పుణ్యక్షేత్రం అద్భుత రూపంతో ప్రపంచ దేవాలయాల్లోనే ప్రత్యేకతను చాటి చెప్పబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని పునః ప్రారంభించేందుకు తుదిమెరుగులు దిద్దే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటునుంచి చూసినా దేవాలయం సర్వాంగసుందరంగా కనిపించేలా తీర్చిదిద్దాలన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

* చిత్తూరు జిల్లాలోని తిరుపతి పార్లమెంట్‌ బరిలో భాజపా అభ్యర్థి పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మురళీధరన్‌ తెలిపారు. జనసేన మద్దతుతో భాజపా అభ్యర్థి బరిలో నిలబడతారని ఆయన ట్వీట్‌ చేశారు. తిరుపతిలో పోటీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

* తెలంగాణలో రోజుకు కనీసం 50వేలకు తగ్గకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల అధికారులు, ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఈటల దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

* సాహిత్య రంగంలో విశేష రచనలకు ఏటా అందించే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2020 ఏడాదికి గానూ మొత్తం 20 భాషల్లో రచనలను ఈ జాతీయ అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగులో నిఖిలేశ్వర్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆయన రచించిన అగ్నిశ్వాస (2015-2017)కు కవితా సంపుటికి ఈ అరుదైన పురస్కారం దక్కింది. నిఖిలేశ్వర్‌ అనేది కలం పేరైతే.. ఆయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి.

* సంబంధం లేని అంశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనమవుతోందని మండిపడ్డారు. తెదేపా నేతలపై ఇవి ముమ్మాటికీ కక్షసాధింపు చర్యలేనని.. వైకాపా వికృత రాజకీయాలతో ప్రజలను భయపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల అవినీతి, అక్రమాలపై ఆధారాలతో నిరూపించిన వారిపై కక్షసాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.