వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఇతర మెసేజింగ్ యాప్ లకు చుక్కలు చూపిస్తుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన వ్యతిరేకితను మరిచిపోయేలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తుంది. తాజాగా వాట్సప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొనిరాబోతుంది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సప్‌లోని మీ ఛాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు. మళ్లీ చాట్స్ ని రీస్టోర్ చేసే సమయంలో పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లు పరీక్షిస్తున్నట్లు ‘వాబీటా ఇన్ఫో’ సమాచారం ఇచ్చింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని ట్విటర్ లో షేర్ చేసింది. ఈ ఫీచర్ వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం వాట్సప్‌లోని ఛాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది వాట్సప్. పాస్‌వర్డ్ సెట్ చేస్తే ఆ ఛాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి. ఇప్పటికే వాట్సాప్ డెస్క్ టాప్ యూజర్ల కోసం వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. అలాగే, డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్‌ని కూడా మార్చబోతోంది. ప్రస్తుతం వారం రోజులు ఉన్న టైమ్ 24 గంటలకు తీసుకొనిరానుంది. త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ చేయొచ్చు.
మెసేజ్ డిలీషన్‌కు నూతన ఫీచర్
Related tags :