DailyDose

వాలంటీర్ దారుణ హత్య-నేరవార్తలు

వాలంటీర్ దారుణ హత్య-నేరవార్తలు

* అనంతపురం జిల్లా కూడేరు మండలంలో దారుణం.. శివరాంపేటలో దారుణ హత్య, పొలంలో నిద్రస్తున్న గ్రామ వలంటరీ శ్రీకాంత్ (24) ను కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని హంతకులు, విచారణ చేపట్టిన పోలీసులు.

* శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని కాన్స్రో సమీపం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సి-4 బోగీలో మంటలు ఒక్కసారిగా చెలరేగినట్లు ప్రాథమిక సమచారం. ఈ బోగీలోని ప్రయాణికులందరిని సురక్షితం తరలించామని, వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.

* వర్షం నుంచి తప్పించుకునేందుకు నలుగురు ఉద్యానవన సిబ్బంది చెట్టును ఆశ్రయించారు. అలా చేయడమే వారి పాలిట శాపమైంది. వారు తల దాచుకున్న చెట్టుపై పిడుగు పడింది. దాంతో నలుగురూ అక్కడికక్కడే కూలిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

* ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యబిహార్​లో దారుణం జరిగింది. సుపౌల్​లోని రాఘోపుర్​ గ్రామంలో.. ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడితో దంపతులు ఉరి వేసుకొని చనిపోయారు. ఈ ఘటనతో ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి.చనిపోయిన వారంతాా చివరగా.. గత శనివారం బయటకు కనిపించారని గ్రామస్థులు చెబుతున్నారు.వాసన రావడంతో.. వెళ్లి చూడగా చనిపోయి ఉన్నారని చెప్పారు. ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని అనుమానిస్తున్నారు.

* పశ్చిమ గోదావరి జిల్లా….జంగారెడ్డిగూడెం మండలం లో గంజాయి కలకలం..తిరుమలాపురం లోని ఒక ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతూ గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం పోలీసులు సిబ్బందితో కలిసి దాడి చేసిన వైనం11 మంది అరెస్ట్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* కృష్ణా జిల్లా:-తోటి మహిళా సచివాలయ ఉద్యోగిని పై వేధింపులకు గురి చేస్తున్న సచివాలయ ఉద్యోగి కిషోర్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు.కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామ సచివాలయం లో ఉద్యోగం నిర్వహిస్తున్న మహిళ ఉద్యోగిని పై కిషోర్ తనను ప్రేమించాలని వేధిస్తున్నట్లు మహిళా ఉద్యోగిని తన ఫిర్యాదు లో పేర్కోంది‌.దీనిపై కేసు నమోదు చేసిన కంచికచర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.మహిళా ఉద్యోగినే కాకుండా మరికోందరు కూడా ఈ కిషోర్ వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో తేలడం అతనిని అరెస్టు చేసి నందిగామ కోర్టు లో హాజరు పరిచారు.కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.