* అనంతపురం :అనంతలో విషాదం.పెనుకొండ భోగసముద్రం చెరువు లో ఈతకు వెళ్లి నలుగురు మృతి, ఇద్దరిని కాపాడిన ఫైర్ సిబ్బంది.ప్రఖ్యాత పెనుకొండ దర్గా దర్శనానికి వచ్చి ఘటన.మృతులు అనంతపురం సూర్య నగర్ వాసులు.మృతులు…తస్లీమా.14. సాధిక్ 40. అల్లాబాకాష్ 45. షాషా17.
* పంజాబ్‌కు చెందిన పఠాన్‌కోట్‌లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ కనిపించింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ డ్రోన్ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.సరిహద్దుల్లో పహారా కాస్తున్న బీఎఫ్ఎప్ జవానులు దీనిని గమనించారు.వెంటనే దానిపై కాల్పులు ప్రారంభించారు. అయితే ఇంతలోనే ఆ డ్రోన్ పాకిస్తాన్ వైపు వెళ్లిపోయింది.దీంతో బీఎస్ఎఫ్ జవానులు ఆ ప్రాంతంలో అణువణువుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.బీఎస్ఎఫ్తోపాటు స్వెట్ కమెండోలు డోన్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.వీరికి బీఎస్ఎఫ్ అధికారి తరసెమ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు.ఈ ప్రాంతంలో అనుమానాస్పద వస్తువేదైనా కనిపిస్తే తమకు తెలియజేయాలని ఆయన స్థానికులను కోరారు.
* క్రిమినల్ కేసుల్లో తప్పుడు ఫిర్యాదులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును భాజపా నేత ఒకరు కోరారు.అటువంటి తప్పుడు విచారణల వల్ల ఇబ్బందులు పడ్డవారికి పరిహారం చెల్లించేలా నిర్దేశించాలని కోరారు.
* బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయం అయ్యేందుకు దాడి కారణం కాదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధరించినట్లు తెలిసింది.