Health

కర్ణాటకలో లాక్‌డౌన్

కర్ణాటకలో లాక్‌డౌన్

కర్ణాటకలో కరోనా వైరస్‌ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్‌ ఛాయలు ప్రస్ఫుటమవుతున్నాయి. మార్చి నెలారంభం నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సుమారు 48 రోజుల తర్వాత రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు చేరింది. ఈ ఏడాదిలో జనవరి 23వ తేదీన గరిష్టంగా 902 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గత శుక్రవారం 833 పాజిటివ్‌లు వెలుగుచూశాయి. సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా కరోనా టీకా వేశారు.  శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 9,58,417 ఉంది.