* ఏపీలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడైన అన్ని కార్పొరేషన్లలోనూ ఫ్యాన్ గాలి వీచింది. మున్సిపాలిటీల్లోనూ తాడిపత్రి, మైదుకూరు మినహా అన్ని చోట్లా అధికార పార్టీకే ప్రజలు పట్టంకట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైకాపాకు ఓట్ల వర్షం కురిపించాయి. ప్రతిపక్ష తెదేపా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో తెదేపా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని భావించినా నామమాత్ర స్థానాలనే ఆ పార్టీ దక్కించుకుంది. జనసేన, భాజపా ప్రభావం కనిపించలేదు. మొత్తం 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు నగరపాలక సంస్థల్లో ఫలితాలను వెల్లడించలేదు.ఇప్పటికే వెల్లడైన ఫలితాల ప్రకారం విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప కార్పొరేషన్లలో వైకాపా విజయ ఢంకా మోగించింది. విజయవాడ, మచిలీపట్నంలో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. విజయవాడలో మొత్తం 64 డివిజన్లు ఉండగా ఇప్పటివరకు 36 స్థానాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయింది. వీటిలో 26 చోట్ల వైకాపా, 10 చోట్ల తెదేపా గెలుపొందాయి. మిగిలిన 28 స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మచిలీపట్నంలో 49 డివిజన్లు ఉండగా 32 చోట్ల లెక్కింపు పూర్తయింది. వీటిలో 27 స్థానాల్లో వైకాపా, 4 చోట్ల తెదేపా, ఒకచోట జనసేన విజయం సాధించాయి. మిగతా 24 స్థానాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు.కార్పొరేషన్ల వారీగా పరిశీలిస్తే..విజయనగరం ఈ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా 42 చోట్ల వైకాపా, ఒక చోట తెదేపా, ఒకస్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.విశాఖపట్నం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్‌లో 98 డివిజన్లు ఉండగా వైకాపా 58 చోట్ల, తెదేపా 30 స్థానాల్లో గెలుపొందాయి. జనసేన 4, భాజపా 1, సీపీఎం 1, సీపీఐ 1, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.గుంటూరు మొత్తం 57 డివిజన్లు ఉండగా ఎన్నికలకు ముందే ఒకస్థానం ఏకగ్రీవమైంది. మిగిలిన 56 స్థానాల్లో వైకాపా 43, తెదేపా 9, జనసేన 2, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. ఏకగ్రీవమైన అభ్యర్థి కూడా వైకాపాకు చెందిన వ్యక్తే కావడంతో గుంటూరు నగరపాలికలో ఆ పార్టీ గెలుపొందిన స్థానాలు 44.ఒంగోలు ఇక్కడ ఉన్న 50 డివిజన్లలో వైకాపా 41, తెదేపా 6, జనసేన 1, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు.చిత్తూరు ఈ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో వైకాపా 46, తెదేపా 3, ఇతరులు 1 చోట విజయం సాధించారుతిరుపతి ఇక్కడ మొత్తం 49 డివిజన్లు ఉండగా వైకాపా 48చోట్ల, తెదేపా 1చోట గెలిచాయి.అనంతపురం మొత్తం 50 డివిజన్లలో వైకాపా, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.కడప ఈ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. దీనిలో వైకాపా 48, తెదేపా 1, ఇతరులు 1 చోట విజయం సాధించారు.కర్నూలు మొత్తం 52 డివిజన్లలో వైకాపా 41, తెదేపా 8, స్వతంత్రులు 3 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు.
* రాష్ట్రం జరిగిన రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ పార్టీదే విజయమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి తెరాస డబ్బు పంపిణీ చేసిందని.. అయినా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు.
* పురపాలక ఎన్నికల ఫలితాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. కొన్ని చోట్ల ప్రాణాలు పణంగా పెట్టి మరీ పార్టీకి అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుత ఫలితాలు చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని అన్నారు. వైకాపా అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
* కోర్టు తీర్పులు సరళంగా, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఓ వ్యాజ్యంపై శనివారం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం.. తీర్పు పాఠాన్ని రాసిన విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి హిమాచల్ హైకోర్టు రాసిన తీర్పు పాఠం.. తలనొప్పి తెప్పించిందని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఆర్.షా వ్యాఖ్యానించారు ‘‘తీర్పు ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు. పెద్ద పెద్ద వాక్యాలైతే ఉన్నాయి. ముందు ఒకటుంది. చివరికొచ్చేసరికి ఇంకోలా ఉంది. తీర్పు చదువుతున్నప్పుడు నా పరిజ్ఞానంపై నాకే అపనమ్మకం ఏర్పడింది. చివరి పేరా చదివిన తర్వాత తలనొప్పికి టైగర్ బామ్ రాసుకోవాల్సి వచ్చింది’’ అని ఎం.ఆర్.షా అన్నారు. తీర్పులో తనకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ‘‘తీర్పు.. ఇలానా రాసేది. ఉదయం 10.10 గంటలకు చదవడం ప్రారంభించా. 10.55కి ముగించేసరికి నా పరిస్థితిని మీరు ఊహించలేరు. ఒక్క ముక్క అర్థం కాలేదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పులను చంద్రచూడ్ ప్రస్తావించారు. అయ్యర్ తీర్పులు సరళంగా, చదివేవారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించేవి కావని అన్నారు.
* కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం కుదేలైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కాలంలో ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. కొన్ని నెలలపాటు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలు కొనసాగిస్తూనే దేశీయ ప్రయాణాలకు అనేక దేశాలు అనుమతులిచ్చాయి. అయినా ప్రయాణికులు లేక విమానయానరంగం నష్టాలను చవిచూస్తోంది. దీంతో ప్రభుత్వాల సహాయం కోరుతూనే ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు టికెట్ ధరలు తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటస్ అనే ఎయిర్‌లైన్ సంస్థ ఓ భిన్నమైన పద్ధతిని ఎంచుకుంది. ప్రయాణికుల్లో విమానయానంపై ఆసక్తి పెంచేందుకు ‘మిస్టరీ ఫ్లైట్’ పద్ధతిని అమలు చేస్తోంది.
* రాష్ట్రం జరిగిన రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ పార్టీదే విజయమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి తెరాస డబ్బు పంపిణీ చేసిందని.. అయినా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. తెరాసకు రెండో స్థానం కూడా దక్కదన్నారు. పొత్తు విషయంలో జనసేనతో ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు. ఏమైనా ఇబ్బంది ఉంటే తనతో చర్చించవచ్చన్నారు.
* ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 298 కేసులు నమోదయ్యాయి. 45,664 నమూనాలను పరీక్షించగా తాజాగా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,91,861కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,184కి చేరింది.
* ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సోషల్‌మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జైలుశిక్ష విధిస్తామని కేంద్రం బెదిరిస్తోందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రభుత్వం ‘సోషల్‌మీడియా’ ఉద్యోగులను ఎప్పుడూ అలా బెదిరించలేదని వెల్లడించింది. ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్నట్లుగా భారత చట్టాలను, భారత రాజ్యాంగాలను పాటించడం సోషల్‌మీడియా సంస్థల బాధ్యత అని పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వందలాది పోస్టులు, ఖాతాలు, హ్యాష్‌ట్యాగ్‌లను తొలగించాలని ట్విటర్‌ను కేంద్రం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.
* కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం పేర్కొన్నారు. ఆయన నేడు పీటీఐ వార్త సంస్థతో మాట్లాడారు. ఇలాంటి సమయంలో దేశ పరపతి విధానంలో భారీ మార్పులు చేస్తే బాండ్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందనన్నారు. ప్రస్తుత విధానం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంతోపాటు వృద్ధికి ఊతమిస్తోందన్నారు. ఇక 2024-25 నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యం జాగ్రత్తగా అంచనా వేసిందనదానికంటే.. మరింత ఆశాజనకంగా నిర్దేశించుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.
* దేశంలో చమురు ధరలు, ప్రైవేటీకరణ అంశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. దేశం ఏమైపోయినా సరే.. స్నేహితులకు లాభం చేకూర్చాలని మోదీ సంకల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం.. పెట్రోల్‌పై పన్నులు విధిస్తూ రూ.21లక్షల కోట్లు వసూలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
* తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 164 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం దీన్ని విడుదల చేశారు. ఇందులో ఎప్పటిలానే ఉచితాలకు పెద్దపీట వేశారు. ఉచిత వాషింగ్ మెషిన్లు, కేబుల్ టీవీ వంటివి ఇందులో ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే ఉచిత వాషింగ్‌మెషిన్లు, ఉచిత సోలార్ స్టవ్‌లు, అందరికీ ఉచిత కేబుల్ టీవీ సౌకర్యం కల్పిస్తామని అన్నాడీఎంకే తన మేనిఫెస్టోలో పేర్కొంది.
* కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం కుదేలైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కాలంలో ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. కొన్ని నెలలపాటు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలు కొనసాగిస్తూనే దేశీయ ప్రయాణాలకు అనేక దేశాలు అనుమతులిచ్చాయి. అయినా ప్రయాణికులు లేక విమానయానరంగం నష్టాలను చవిచూస్తోంది. దీంతో ప్రభుత్వాల సహాయం కోరుతూనే ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు టికెట్ ధరలు తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేస్తున్నాయి.
* నందిగ్రామ్ వ్యవహారంలో మమతా బెనర్జీ సెక్యూరిటీ డైరెక్టర్‌పై ఎన్నికల సంఘం వేటు వేసింది. జడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తికి రక్షణ కల్పించడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంటూ ఐపీఎస్ అధికారి అయిన వివేక్ సహాయ్‌పై చర్యలు తీసుకుంది. తక్షణమే సస్పెండ్ చేయాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చింది. అభియోగాలు నమోదు చేయాలని సూచించింది. మమత కాలికి గాయమైన నేపథ్యంలో నందిగ్రామ్ వెళ్లి పరిశీలించిన ప్రత్యేక పరిశీలకులు ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని, ప్రమాదవశాత్తూ ఆమె గాయాలపాలయ్యారని ఈసీకి నివేదిక సమర్పించారు.
* టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ రెండు నెలల్లో మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడని, చాలా మంది తమ జీవిత కాలంలో అలా చేయలేరని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ ఛాపెల్ పేర్కొన్నాడు. తాజాగా పంత్ గురించి ఓ క్రీడా ఛానెల్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఆస్ట్రేలియా పర్యటనలో.. సిడ్నీ టెస్టులో 97, గబ్బా టెస్టులో 89*, తాజాగా ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో 101 శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్‌ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడే పంత్ ఆదుకున్నాడు.