అమెరికాలోని డెన్వర్ నగరంపై మంచు తుఫాన్ పంజా విసిరింది.
భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
దీంతో శని, ఆదివారాల్లో కలిపి డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన సుమారు 2,000 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.
డెన్వర్, బౌల్డర్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు దాదాపు 46 నుంచి 61 సెంటీమీటర్ల మంచు కురిసే అవకాశం ఉన్నట్లు జాతీయ వాతావరణ శాఖ పేర్కొంది.
కనుక ఈ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.