WorldWonders

తాజ్‌మహల్ పేరు మారుస్తాం

UP Govt MLA Says Taj Mahal Will Be Renamed

ఆగ్రాలోని తాజ్‌మహల్‌ పేరు రామ్‌మహల్‌ లేదా కృష్ణమహల్‌గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్‌ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేంద్ర సింగ్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాజ్‌మహల్‌ ఒకప్పుడు శివాలయం అని, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తాజ్‌మహల్‌ పేరును త్వరలో రామ్‌మహల్‌గా లేదా కృష్ణమహల్‌గా మార్చుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను శివాజీ వారసుడితో పోల్చుతూ.. సమర్ గురువు రామ్‌దాస్ శివాజీని భారతదేశానికి ఇచ్చినట్లుగానే, గోరఖ్‌ నాథ్‌ బాబా యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చారని వ్యాఖ్యానించారు.