హాయిగా నిద్రపోదాం
నిద్ర, ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతిని కలుగజేస్తుంది. నిద్రలేకుండా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ఇతర దీర్గాకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఇంతటి ప్రాధాన్యమున్న నిద్రకు ఈ కాలంలో పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదు. యాంత్రిక జీవనంలో క్షణ.. క్షణం ఒత్తిడితో గడుపుతున్నారు. అర్ధరాత్రి దాటినతరువాత నిద్రపోవటం తిరిగి వేకువజామునే లేచి దైనందిని జీవితం ప్రారంభించడం ఎక్కువ మందిలో పరిపాటైంది. నిద్ర ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) ప్రతి ఏడాది మార్చి రెండో శుక్రవారాన్ని అంతర్జాతీయ నిద్రదినోత్సవంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఒక్కో విధానాన్ని విడుదల చేస్తోంది. ఈ ఏడాది ‘మంచిగా నిద్రపోదాం-ఆరోగ్యం, ఆనందాన్ని పొందుదాం’ అన్న నినాదాన్ని ప్రకటించిది.
**మానవుడికి నీరు, ఆహారం, ప్రాణవాయువు ఎంత అవసరమో నిద్రఅంతే అవసరం. సగటున మానవుడు 6-8 గంటల వరకు నిద్రపోవాలి. కాని ఇంతకు తగ్గినా, పెరిగినా కొన్ని వ్యద్దులకు దారి తీస్తుంది. నిద్రలేమితనాన్ని ఇన్సోమియా, అతి నిద్రను హైపర్ సోమియాగా వైద్య భాషలో పిలుస్తుంటారు. ఈ రెండు ప్రమాదకర వ్యాధులే. నిద్రలేమి కారణంగా 35శాతం ఉబకాయం, 54 శాతం డయాబెటిస్, 80 శాతం గుండెపోటు, 90 శాతం మానసిక వేదన (డిప్రెషన్), 98శాతం ఎక్యుట్ కరోనరి సిండ్రోమ్, 102 శాతం పక్షవాతానికి దారితీయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
*నిద్రలేమితో ప్రమాదాలు:
నిద్రలేమి కారణంగా ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 71 వేల రహదారి ప్రమాదాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. అలాగే 1550 మంది ఈ ప్రమాదాల్లో మృతి చెందినట్లు సర్వేల ద్వారా లెక్కలు తేల్చారు.
*నిద్రలేమి ఇలా గుర్తిద్దాం..:
నిద్రపట్టడం కష్టంగా వుండటం, రాత్రి వేళల్లో ఉలిక్కిపడి లేవడం, మానసిక ఆందోళన, వేకువజామునే లేవటం, నిద్రనుంచి లేచిన తరువాత తీవ్ర బడలిక నిద్రలేమి ప్రాధమిక లక్షణాలుగా గుర్తించాలి. అలాగే తీవ్రమైన తలనొప్పి, అలసట చికాకు నిద్రలేమిగా గుర్తించాలి.
*అధిగమిద్దాం ..:
నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు వైద్య నిఫుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రధానమైనవి ఇలా ఉన్నాయి.
*ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయానికి నిద్రపోవటం, తిరిగి లేవటం ఆలవాటు చేసుకోవాలి.
*పగలు నిద్రపోయే అలవాటుంటే అది 45 నిమిషాలకు మించకూడదు.
*నిద్రపోయే ముందు మద్యపానం, ధూమపానం చేయకూడదు.
* టీ, టిఫిన్, సోడా, చాక్లెట్లు, తీపిపదార్దాలు నిద్రకు ముందు తీసుకోకూడదు .
* నిత్యం వ్యాయామం చేయడం అత్యవసరం.
*రాత్రి 10గంటలకు నిద్రకు ఉపక్రమించి ఉదయం 5 గంటలకు లేవడం మంచి ఆరోగ్యానికి దారి తీస్తోంది.
* నిద్రపోయే గదిని మంచిగా తమకు నచ్చిన విదంగా అలంకరించుకోవడం అవసరం.
*గది, వెలుతురు ,ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండాలి.
*నిద్రకు భంగం కలిగించే వాటిని (శబ్దం, వెలుతురు) దూరంగా ఉంచాలి.
* విశ్రాంతి గది (బెడ్ రూమ్)ని నిద్రకు మాత్రమే ఉపయోగించాలి. అంతేకాని ఆఫీసు పనులకు, టీవీ, వీడియోగేమ్లు , ఇంటర్నెట్ ఛాటింగ్ లకు వినియోగించకూడదు. ఇవి నిద్రా భంగానికి దారి తీస్తాయి.
నిద్ర…సర్వ రోగ నివారిణి
Related tags :