టెక్సాస్ రాష్ట్రంలో తెలుగువారికి గత దశాబ్ద కాలానికి పైగా సుపరిచితుడు, ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు, మృదుభాషి… పోలవరపు శ్రీకాంత్ ఈ ఏడాది జరిగే తానా ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ నుండి ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో ఉన్నారు. ఆయన TNIతో మాట్లాడారు. అమెరికాకు పర్యటకులుగా వచ్చే తల్లిదండ్రులకు వైద్య బీమా సౌకర్యం, ఆపదలో అన్నీ పోగొట్టుకున్న ఆపన్నులకు కాన్సులేట్లతో సమన్వయం, రహదారి ప్రమాదాల్లో మృతిచెందిన వారికి చేయూత వంటి ఎన్నో కార్యక్రమాలు తానా టీంస్క్వేర్ ద్వారా విజయవంతంగా నిర్వహించిన ఆయన ఈసారి సేవా కార్యక్రమాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అందుకే తానా ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో ఉన్నానని, సేవ చేయాలంటే ముందు ఎదుటివారి అవసరాలు క్షుణ్నంగా తెలిసి ఉండాలని, తనకు టీంస్క్వేర్తో పాటు తానా ఫౌండేషన్ ట్రస్టీగ గత రెండేళ్లుగా లభించిన అపరిమితమైన అనుభవాలను ఫౌండేషన్ ద్వారా నిర్వహించే కార్యక్రమాల విస్తృతికి వినియోగిస్తానని ఆయన అంటున్నారు. 2001లో H1Bపై అమెరికాకు వచ్చిన ఆయన 2003-05 మధ్య ద్వైవార్షిక జీవిత కాల సభ్యుడిగా, 2005 నుండి శాశ్వత జీవిత కాల సభ్యుడిగా తానాలో కొనసాగుతున్నారు. డల్లాస్ తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలందించిన ఆయన టీంస్క్వేర్ అధ్యక్ష, ఉపాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించి దాని బలోపేతానికి కృషి చేశారు. ఆయన గురించిన మరింత సమాచారం దిగువ చూడవచ్చు….
తానా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు-TNIతో పోలవరపు శ్రీకాంత్
Related tags :