Business

ఏప్రిల్ నుండి నూతన బ్యాంకింగ్ నిబంధనలు-వాణిజ్యం

Business News - New Banking Rules 2021 From April

* కొత్త ఆర్ధిక సంవత్సరం వచ్చేస్తున్నది. వస్తూవస్తూ తనతోపాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా వెంట తెస్తున్నది.కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కొత్త నియమాలను అమలు చేయనున్నారు.కేంద్ర ప్రభుత్వం 8 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా మార్చిన నేపథ్యంలో పాత బ్యాంకులకు సంబంధించిన పాస్‌బుక్కులు, చెక్‌బుక్కులు ఏప్రిల్ 1 నుండి పనిచేయవనే విషయాన్ని వినియోగదారులు గుర్తించాలి.విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులకు చెందిన వినియోగదారులు.. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తమ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్కులతో పాటు ఐఎఫ్ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కూడా మారనున్నాయని తెలుసుకోవాలి.ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులతో విలీన ప్రక్రియ 2019 ఏప్రిల్ 1, 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి.విలీనం చేసిన బ్యాంకుల కస్టమర్లు.. తమ మొబైల్ నంబర్, చిరునామా, నామినీ మొదలైన వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.అయితే, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కస్టమర్లకు కొంత ఉపశమనం లభించింది.సిండికేట్ బ్యాంక్ ఖాతాదారుల ప్రస్తుత చెక్ బుక్స్ 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని బ్యాంకు ప్రకటించింది.కొత్త చెక్‌బుక్కు, పాస్‌బుక్కు పొందిన తర్వాత.. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఆదాయపు పన్ను ఖాతా, ఎఫ్డీ / ఆర్డీ, పీఎఫ్ ఖాతా, బ్యాంక్ ఖాతాలు వంటి వాటిలో కూడా వినియోగదారులు తమ సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఇంకా అంతేకాకుండా ఆదాయపు పన్ను విషయంలో కూడా కొన్ని మార్పులు రానున్నాయి.ఏప్రిల్ 1 తర్వాత 75 ఏండ్ల వయసు పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు.పెన్షన్ ద్వారా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నవారికి ఇది వర్తిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతన కోడ్ అమలులోకి రానున్నది. ఈ కోడ్ ద్వారా బేసిక్ పే పెంచనున్నారు.దీంతో బేసిక్ పే పెరిగితే అందులో 12 శాతం పీఎఫ్‌ అకౌంట్‌లో జమ చేయాల్సి ఉంటుంది.పీఎఫ్ పెరిగితే ఉద్యోగస్తుల టేక్ హోమ్ సాలరీ తగ్గుతుందని గుర్తించాలి.వీటితో పాటు ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్లు కూడా పెరుగనున్నాయి.

* యూనైటెడ్ ఫొరమ్ ఆప్ బ్యాంకు యూనియన్ ఆద్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె రెండవ రోజు కొనసాగగా ఎస్బిఐ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. మహబూబ్నగర్ గద్వాల పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు నిర్వహించిన సమ్మేలో పలువురు పాల్గొన్నారు.ఫిబ్రవరి 1 వ తేదీ పార్లమెంట్ లో ఎల్ ఐ సి తో పాటు ఇతరప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరణ చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు.దేశంలో ఉన్న సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రయివేటు చేయడం తగదన్నారు. బ్యాంకు ఉద్యోగులకు తెలంగాణ రైతాంగ సమితి లో పాటలు పలువురు మద్దతు పలికారు

* రాష్ట్రంలో మద్యం కొనుగోళ్ల కోసం టెండర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలరెడ్డి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమిస్తూ.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.దేశంలో తయారైన మద్యం, విదేశీ మద్యం, బీర్ల కొనుగోలు టెండర్లను ఖరారు చేసేందుకు.. కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.ఈ కమిటీ ఛైర్మన్​గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఐఎఎస్ అధికారి డి. వరప్రసాద్, చార్టెడ్ అకౌంటెంట్ కూసిరెడ్డి మరిడేశ్వరరావును నియమించారు.వివిధ మద్యం తయారీ కంపెనీలతో మద్యం కొనుగోలు టెండర్లను ఖరారు చేసే అంశంపై.. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపున.. త్రిసభ్య కమిటీ సంప్రదింపులు జరపనుంది.రాష్ట్రంలో విక్రయించే విదేశీ మద్యం, బీర్ల బ్రాండ్లకు సంబంధించి ధరలను కూడా కమిటీ ఖరారు చేయనుంది.

* ప్రభుత్వ రంగానికి చెందిన అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదని, బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు యూనియన్లు రెండు రోజుల పాటు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి.. ప్రైవేటీకరణను మరోసారి సమర్థించారు.

* నిర్మాణ కార్మికులు, బొగ్గు మైనర్లు, జైలు అధికారులు వంటి తక్కువ-రిస్క్ ఉన్న ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ పొగ‌తాగే అల‌వాటు ఉన్న‌వారు, సాధార‌ణ వ్య‌క్తుల‌ కంటే అధిక ప్రీమియం చెల్లించాలి. పాల‌సీ తీసుకునే ముందు దీని గురించి వివ‌రంగా తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.