DailyDose

తుని రైలు దహనం కేసులో కోర్టుకు ముద్రగడ-నేరవార్తలు

Crime News - Mudragada Padmanabham Attends Court

* తునిలో రైలు దహనం కేసుపై విజయవాడ రైల్వే కోర్టులో నేడు విచారణ జరిగింది.విచారణకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, తుని వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హాజరయ్యారు.రైలు దహనం కేసులో అభియోగాలు ఎదుర్కొంటోన్న 41మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు.తునిలో రైలుదహనం కేసుపై వచ్చిన అభియోగాలపై నిందితులను న్యాయమూర్తి విచారించారు. వచ్చే నెల 6వ తేదీకి కేసు వాయిదా పడింది.తమపై అక్రమ కేసులు నమోదు చేశారని రైలు దహనం కేసుతో తమకు సంబంధం లేదని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు.

* అనంతపురం జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు మీద ధర్మవరం MLA కేతిరెడ్డి చేసిన అవమానకర మరియు అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ SC ,ST, ఉద్యోగుల సేవల సంఘము తీవ్రంగా ఖండించింది.

* కర్నూలు జిల్లా (ఆళ్లగడ్డ) చాగలమర్రి మండలం చిన్న బోధనంలో టిడిపి నేత రమణారెడ్డిపై హత్యాయత్నం.

* చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలోని బస్టాండు సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జిలోని వేర్వేరు గదుల్లో వెంకట్‌ గౌడ్‌ (35), అనిత (31) బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంకట్‌ గౌడ్‌ పురుగుల మందు తాగి చనిపోగా.. అనిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ రెండు రోజుల క్రితం లాడ్జిలో వేర్వేరు గదులు తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యలపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అంజూయాదవ్‌ తెలిపారు.

* తమిళనాడులో ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి.. భార్య, అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో వారిద్దరు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన తల్లితో కలిసి రోడ్డు వెంట వెళ్తుండగా వారిని అనుసరించిన సదరు మహిళ భర్త ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే భార్యతోపాటు, అత్తపై దాడికి పాల్పడ్డాడు. పారిపోయేందుకు ప్రయత్నించినా వెంబడించి మరీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వారిరువురు మృతిచెందారు. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.

* వేసవి కాలం వచ్చిందంటే కొబ్బరి బోండాలు, సోడా బండ్లు, చెరుకు రసాలు, పళ్ల రసాల కొట్లు.. ఇలా వందల్లో దుకాణాలు ప్రధాన రహదారుల పక్కన వెలుస్తుంటాయి. ఇతర వ్యాపారాలు, ఉద్యోగాలూ వదిలి ఈ సీజన్‌ మొత్తం వీటిమీదే బతికేవాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు వీరినే లక్ష్యంగా దోచేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఇక్కడ వ్యాపారం నడవాలంటే రోజూ వీరి చేతులు తడపాల్సిందే. సర్కారు ఖాళీ స్థలాల్ని సైతం తమ సొంత జాగాగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్న వారు కొందరైతే.. ఫుట్‌పాత్‌ మీదా, రోడ్డు పక్కన వ్యాపారం నడవాలంటే డబ్బులు కట్టాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్న వారిలో కొందరు పోలీసులు, బల్దియా సిబ్బంది ఉండటం గమనార్హం. మరోవైపు రాత్రి 10 గంటలు దాటిందంటే ఆ తర్వాత కొట్టు తెరిచి ఉండాలంటే నిర్వాహకుల నుంచి రూ.500 నుంచి ఆపైన వసూలు చేస్తున్నారు కొందరు పెట్రోలింగ్‌ సిబ్బంది.