Fashion

50 దాటాక పురుషులకు కష్టమే

50 దాటాక పురుషులకు కష్టమే

పురుషులు 50 ఏళ్లకు పైబడినవారు, అదే వయసుకు చెందిన మహిళల కంటే త్వరగా మరణించేందుకు 60ు అవకాశాలున్నాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌, న్యూక్యాజిల్‌ యూనివర్సిటీ పరిశోధకులు 28 దేశాల్లో 1.79 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో ఈవిషయాన్ని గుర్తించారు. ఈ స్టడీలో పాల్గొన్న వారిలో 55 శాతం మహిళలే. ప్రపంచవ్యాప్తంగా హృద్రోగ బాధితుల్లో ఎక్కువమంది పురుషులే ఉండటం, వారి ఆయుర్దాయం మహిళల కంటే తగ్గిపోవడానికి ప్రధాన కారణమవుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ధూమపానం అలవాటుతో పురుషులు శ్వాసకోశ సమస్యలను కొని తెచ్చుకొని చేతులారా ఆయుష్షును తగ్గించుకుంటున్నారని చెప్పారు. ఇంటిపెద్ద హోదాలో పురుషుడిపై సహజంగానే ఎంతో ఒత్తిడి ఉంటుందని.. అది కూడా వారి ఆరోగ్యాలపై ప్రతికూలంగా పరిణమిస్తోందని వివరించారు. ఇటువంటి సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు జీవనశైలి, ఆరోగ్యం కూడా ఆయుర్దాయాన్ని నిర్ణయించే కీలక భూమికలని తెలిపారు.