Politics

నేను ఎవరో వదిలిన బాణాని కాదు-షర్మిల: తాజావార్తలు

YS Sharmila Meets With Khammam Leaders

* ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతల తో ముగిసిన షర్మిళ సమావేశం.పార్టీ ఏర్పాటు,విధి విధానాల పై పార్టీ నేతలకు ఉన్న అనుమానాల పై షర్మిల క్లారిటీ.ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల ను కోరిన అభిమానులు.ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల కామెంట్స్.నేను ఎవరు వదిలిన బాణం కాదు.నేను టీఆర్ఎస్ కో లేక బీజేపీ కో.. బి టీమ్ గా ఉండాల్సిన అవసరం లేదు.సమస్యల సాధనకు తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టాను.ఖమ్మం వేదిక గానే సమర శంఖం పూరిద్ధాం.ఏప్రిల్ 9 న లక్ష మంది సమక్షం లో పార్టీ ఏర్పాటు ప్రకటన చేద్దం.

* తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ కు కాలంచెల్లింది.నేతలంతా కలిసి పార్టీని చంపేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు.చంద్రబాబుకు సిఐడి నోటీసు ఒక్కపేజీనే ఇచ్చారు. జగన్ కు ఇవ్వాల్సివస్తే లారీల్లో తీసుకెళ్లాలి-జేసీ దివాకర్ రెడ్డిజాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నోటిసులు ఇవ్వడంపై జెసి దివాకర్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు..వైఎస్ ష‌ర్మిల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి.ఆమె రాజ‌కీయంగా ప్రాక్టీస్ చేసేందుకే తెలంగాణ‌లో పార్టీ పెడుతోంద‌ని అన్నారు.

* తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు వైకాపా అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తిని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉప ఎన్నికకు ఈరోజే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడించనున్నారు. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన తనయుడు బల్లి కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన నేపథ్యంలో డాక్టర్‌ గురుమూర్తిని లోక్‌సభ అభ్యర్థిగా వైకాపా ప్రకటించింది.

* కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఒక్కరోజులోనే 30లక్షల 39వేల 394 మందికి టీకా అందించి.ఈ ఘనత సాధించిన తొలిదేశంగా నిలిచిందని పేర్కొంది.మార్చి 15న(59వ రోజు) చేపట్టిన వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ద్వారా ఈ ఘనత సాధించినట్టు తెలిపింది.ఫలితంగా దేశంలో మొత్తం టీకా లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 29 లక్షల 47వేల 432 దాటినట్టు స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ.ఇప్పటివరకు 5లక్షల 55వేలకుపైగా సెషన్లు నిర్వహించినట్టు పేర్కొంది.వ్యాక్సిన్​ లబ్ధిదారుల్లో సుమారు కోటి మందికిపైగా 60ఏళ్ల పైబడిన వారే ఉన్నారని వివరించింది

* కరోనా వ్యాప్తి నేపథ్యంలో నాలుగు మెట్రో నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ సమయాన్ని మరో రెండు గంటలు పెంచాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.

* భారతీయ రైల్వేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరించబోమని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.అయితే మరింత సౌకర్యవంతంగా రైల్వేని తీర్చిదిద్దేందుకు ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.రైల్వే గ్రాంటుల కోసం వస్తున్న డిమాండ్లపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు గోయల్ ఈ మేరకు స్పందించారు.”భారతీయ రైల్వేను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోం. అది ప్రతిఒక్క భారతీయుడి ఆస్తి. ఎప్పటికీ అలాగే ఉంటుంది. భారత ప్రభుత్వంలో భాగంగానే కొనసాగుతుంది…” అని స్పష్టం చేశారు.

* మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ఇంటికి న్యాయనిపుణులు.సీఐడీ నోటీసులపై న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చ.సీఐడీ విచారణకు హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై చర్చ.నోటీసులపై కోర్టుకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తున్న న్యాయనిపుణులు.

* మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వైరస్‌ నివారణలో భాగంగా, ఇప్పటికే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే, చికిత్స కోసం మాత్రం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా, అల్ట్రాసౌండ్‌ వైబ్రేషన్లతో కరోనా వైరస్‌ను నశింపచేసే అవకాశాలున్నాయని అమెరికాకు చెందిన ఎంఐటీ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మెడికల్ డయాగ్నొస్టిక్ ఇమేజింగ్‌లో వినియోగించే అల్ట్రాసౌండ్‌ ఫ్రీక్వెన్సీతోనే కరోనా వైరస్ కణాల‌ను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు.

* తెలంగాణలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్‌ నాగోల్‌ పరిధి బండ్లగూడలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 36 మంది బాలికలకు కొవిడ్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు. కామారెడ్డిలోని టేక్రియాల్‌ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 32 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అక్కడ విద్యార్థులు, సిబ్బందితో కలిపి 140 మందికి కొవిడ్‌ టెస్టులు చేయగా.. వారిలో 32 మందికి కరోనా సోకినట్లు కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డా. చంద్రశేఖర్ తెలిపారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించినట్లు చెప్పారు.

* తెదేపా అధినేత చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదంటూ రాజ్యాంగంలో ఉందా అని ఏపీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. రాజధానిలోని అసైన్డ్‌ భూముల విషయంలో విచారణకు రావాల్సిందిగా చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఎస్సీల ఆస్తులు కాజేసినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నేరమేన్నారు. విచారణలో భాగంగా సీఐడీ నోటీసులిస్తే కక్ష సాధింపా? అని తెదేపా నేతలను కొడాలి నాని ప్రశ్నించారు.