ఈమధ్య జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు నష్టం వాటిల్లే విధంగా రష్యా ప్రయత్నించినట్లు అమెరికా జాతీయ ఇంటలిజెన్స్ విభాగం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఎన్నికల్లో తనను అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యర్థులతో క్రూరంగా ప్రవర్తిస్తాడని, అతనో ‘కిల్లర్’ అనే భావనను తాను కూడా నమ్ముతున్నట్లు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు.
పుతిన్‌కు బైడెన్ హెచ్చరికలు
Related tags :