తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక తర్వాత పార్టీలో ఎవరు ఎలా పని చేస్తున్నారో బేరీజు వేస్తానని, ఇకపై చిత్తశుద్ధితో పోరాడేవారికే ప్రాధాన్యం ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీకి విధేయంగా ఉన్నారనో, సామాజిక సమీకరణాల కోసమో, మొహమాటంతోనో ఎవరినీ భరించే ప్రసక్తి లేదని.. పని చేసే వారినే పార్టీ పదవుల్లో నియమిస్తామని వివరించారు. భవిష్యత్తులో ఎన్నికల సమయంలోనూ వారికే ప్రాధాన్యమిస్తానని తెలిపారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికను పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. తిరుపతి ఉప ఎన్నికకు సన్నద్ధత, వ్యూహరచనపై ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు శాసనసభ స్థానాలు, మండలాల వారీగా శ్రేణులతో సమావేశమయ్యారు. ఉపఎన్నికల పర్యవేక్షణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, లోకేశ్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి భర్త.. పార్టీ నాయకుడు కృష్ణయ్యలతో కమిటీని ఏర్పాటుచేశారు.
చిత్తశుద్ధికి ప్రాధాన్యం
Related tags :