* పెడన మండలం పంచాయతీ రాజ్ ఏఈ బీవీఎన్ ప్రసాద్ 85 వేలు లంచం పెనుమల్లి గ్రామానికి చెందిన ముమ్మడి శెట్టి బాలసుబ్రహ్మణ్యం నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
* నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్‌లు రద్దు చేయాలని కోరుతూ పిటిషిన్‌లో కోరారు. ఎఫ్ఐఆర్‌లు సవాల్ చేస్తూ.. బాబు, నారయణ తరఫు సీనియర్ న్యాయవాదులు ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను దాఖలు చేయడం జరిగింది. 41ఆ కింద నోటీసులు ఇచ్చి సోదాలు చేస్తున్నారని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది చట్ట, న్యాయ విరుద్ధమని, ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని కోర్టును న్యాయవాదులు కోరారు. రేపు అనగా శుక్రవారం ఉదయం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
* ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఎపిసోడ్‍లో కీలక పరిణామాలు – కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సిసోడియా ఎదుట విచారణకు హాజరైన ఏబీ – ఏబీ వెంకటేశ్వరరావుపై వచ్చిన అభియోగాలపై వివరణ కోరిన సిసోడియా – లిఖితపూర్వకంగా వివరాలు అందజేసిన ఏబీ వెంకటేశ్వరరావు
* నగ్న వీడియోలతో తనను బెదిరించి లొంగదీసుకుని.. పెళ్లి చేసుకుని.. బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు.. తనను చిత్రహింసలు పెట్టి, ట్రిపుల్ తలాక్ చెప్పిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గుంటూరుకు చెందిన ఓ యువతి గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. సినీనటి కరాటే కల్యాణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి వచ్చిన బాధిత యువతి ఫిర్యాదుచేసిన తర్వాత విలేకర్లతో మాట్లాడారు.