Food

మెగ్నీషియం చాలా ముఖ్యం

మెగ్నీషియం చాలా ముఖ్యం

నిత్యం మనం అన్ని పోషకాలు ఉన్న ఆహారాలను కచ్చితంగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే ఏదో ఒక అనారోగ్య సమస్య మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ క్రమంలోనే మెగ్నిషియం కూడా మన శరీరానికి అవసరమే. అది మన శరీరంలో 300 రకాల క్రియల్లో ముఖ్య పాత్ర పోషిస్తుందట. అందుకని మెగ్నిషియం ఉన్న ఆహారాలను కూడా రోజూ తీసుకోవాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.గుండె కొట్టుకోవడం, కండరాలు, హార్మోన్ల పనితీరు వంటి ఎన్నో చర్యల్లో మెగ్నిషియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెగ్నిషియం తగినంతగా లేకపోతే ఆకలి లేకపోవడం, తల తిరగడం, ఒత్తిడి, శరీరంలో తిమ్మిర్లు రావడం, పలు భాగాలు మొద్దు బారిపోవడం, నొప్పులు తదితర సమస్యలు మనకు వస్తాయి. అయితే మెగ్నిషియం లోపం రావడానికి మనం ఆ పోషక పదార్థం ఉన్న ఆహారం తీసుకోకపోవడం ఒక్కటే కారణం కాదు. పలు ఇతర అంశాలు కూడా అందుకు కారణాలుగా ఉన్నాయి.మితిమీరిన మోతాదులో నిత్యం కాఫీ, ఆల్కహాల్, సోడా తాగితే శరీరానికి మెగ్నిషియం సరిగ్గా అందదు. అలాగే కూల్ డ్రింకులు తాగినా, తీపి పదార్థాలను అధికంగా తిన్నా మెగ్నిషయం మనకు లభించదు. కనుక మెగ్నిషియం లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే.. ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు, నట్స్, చేపలు, పెరుగు, అరటి పండ్లు, డార్క్ చాకొలెట్లు తదితర ఆహారాలను తీసుకోవాలి. దీంతో మెగ్నిషియం లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.